Siddipeta | రాయపోల్, మార్చి 12 : భూగర్భజాలలు ఒక్కసారిగా అడుగంటి పోవడంతో యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అత్యతం దయనీయంగా మారింది. ఒకవైపు కరెంట్ కొతలు, మరోవైపు బోరు మోటర్లు కాలిపోవడం, కండ్లముందే వేసిన పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు మేతగా మారడడంతో రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంతో అశతో యాసంగి సాగు చేసిన రైతులు నీటి సౌకర్యాం లేకపోవడంతో పాటు కేవలం కొన్ని గ్రామలకు గోదావరి నీరు రావడం మిగతా గ్రామాల రైతులకు రాకపోవడంతో రైతులు పంటలు కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి నీటి కాల్వలు లేకపోవడంతో గ్రామ రైతులు బోర్లపై అధరాపడాల్సి వస్తుంది. వేసిన పంటలను ఎలాగైన రక్షించుకోవాలనే లక్ష్యంతో గత 15 రోజుల్లో సుమారు 30 మంది రైతులు బోర్లు వేసిన చుక్క నీరు రాలేదు. దీంతో గ్రామ రైతులు వ్యవసాయంపై అశలు వదులుకున్నారు. కొద్దిపాటి నీరు పడితే సింగిల్ ఫేజ్ మోటర్లు వినియోగించి కూరాగాయలను పండిస్తున్నారు. ఈ గ్రామానికి గోదావరి సాగు నీరు కాల్వలు పూర్తి కాలేదు. దీంతో బోర్లు వేసి రైతులు ఆగమవుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నేలకొంది.