మియాపూర్ టు ఇస్నాపూర్
పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగించాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విన్నవించగా, తక్షణం స్పందించిన సీఎం ఇందుకోసం హామీ ఇచ్చారు.
- మెట్రో రైలు పొడిగింపునకు గ్రీన్ సిగ్నల్
- రాష్ట్ర కేబినెట్లో ఆమోదం
- ప్రకటించిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్
- నెరవేరనున్న పటాన్చెరువాసుల కల
- ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగించాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విన్నవించగా, తక్షణం స్పందించిన సీఎం ఇందుకోసం హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే కార్మికులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు, ప్రజలకు వరంలా మారనున్నది.
– పటాన్చెరు, జూలై 31
పటాన్చెరు, జూలై 31: పటాన్చెరులో ఈ మధ్య జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మెట్రో వరం సాకారం కానున్నది. సోమవారం రాష్ట్ర కేబినెట్ చేసిన పలు కీలక తీర్మానాల్లో మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో పొడిగింపు ఉంది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన పలు తీర్మానాలను ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. సీఎం పర్యటన సందర్భంగా పటాన్చెరు ప్రాంత ప్రజల తరపున మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో ట్రైన్ పొడిగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. తక్షణం స్పందించిన సీఎం మూడో విడుత మెట్రోను పటాన్చెరు వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ ఇస్నాపూర్ వరకు మెట్రోరైలును పొడిగిస్తూ తీర్మానించింది. పాశమైలారం, ఇస్నాపూర్, పటాన్చెరు, రామచంద్రాపురం, బీరంగూడ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు, ప్రజలకు మెట్రో వరంలా మారనున్నది. అత్యంత రద్దీతో ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. మెట్రో రైలు పొడిగింపుతో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌పడడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

