న్యాల్కల్, ఆగస్టు 31:మాకు వ్యవసాయమే జీవనాధా రం. ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటే ఎలా బతకాలని సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి, వడ్డి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామాలకు చెందిన 2,003 ఎకరాల భూములను తీసుకుంటే రోడ్డుపాలు కావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎంత వరకైనా సరే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు వస్తే తమ బతుకులు ఆగమవుతాయని, ఎక్కడికో, ఏ ప్రాంతానికో కుటుంబాలు వలస పోవాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మనిషి పుట్టింది మొదలు భూమితో విడదీయని అనుబంధం ఉంటున్నది. అది కేవలం భౌతికమైనది. యాజమాన్య భావనకు సంబంధించి మాత్రమే కాదు. అం దుకు అతీతమైన మరేదో బంధం శాశ్వత భావనతో కట్టి పడేస్తుంది. అందుకే అంటారు గంటెడైనా, గుండ్దైనా.. భూమి ఉంటే ఆభరోసాయేవేరు అని. ఆస్తిగానే కాదు భూమి అస్తిత్వపు ఉనికిగా, భూమికగా, చిరునామాగా ఆ సమాజం చూస్తున్నది.
కాబట్టి మనిషికి అంతటి పెనుగులాట. తాను నమ్ముకున్న భూమి తనకు కాకుండా పోతుందంటే రోజులు, నెలలు, ఏండ్ల తరబడి ఏడుస్తారు. రక్తం చిందించాల్సి వస్తుందని తెలిసినా నిరసనతో రోడ్డెక్కుతారు. తాను గతించాక కుటుంబం ఆగమైతదని తెలిసినా.. ఆత్మహత్యకు సాహసిస్తాడు. మట్టికి-మనిషికి ఉన్న బంధం అలాంటిది. ఇది గ్రహించని ప్రభుత్వాలు తాతలు, ముత్తాతల కాలంగా వచ్చినా, కొనుగోలు చేసిన పట్టా, పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూ ములను తీసుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు రైతులు. ఫార్మాసిటీ కోసం న్యాల్కల్ మండలంలోని డప్పూర్లో 1465.25 ఎకరాలు, మల్గిలో 282,13 ఎకరాలు, వడ్డిలో 256 ఎకరాల భూ ములు కోల్పోతున్న రైతులను శనివారం ‘నమస్తే తెలంగాణ’ పలకరిస్తే తమ కన్నీటి గాథలను వెలిబుచ్చారు.
మాకు ఉండేది ఎకరం భూ మి. ఇది ఫార్మాసిటీకి ఇస్తే ఎలా బతకాలి. వారు ఇచ్చే పరిహారంతో మాకు మరో చోట భూమి రాదు. కుటుం బ జీవనం అస్తవ్యస్తమవుతున్నది. అందుకే మేం భూములివ్వం. ప్రాణాలు పోయినా సరే ఇచ్చేది లేదు. ప్రభుత్వం తన నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
-బుర్జు విఠల్గౌడ్, రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం
భూములపైనే ఆధారప డి బతికే పేద రైతులం. వాటిని తీసుకుంటే మేం బతకలేము. భూ ములకు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకొద్దు. సా గు భూములు తీసుకుని రైతుల పొట్టకొట్టొ ద్దు. కంపెనీలు పెట్టి మమ్ముల్ని ఇబ్బందులు పెట్టొద్దు. వాటి కాలుష్యంతో మాకే నష్టం.
– డొవ్వూరు గుండన్న, రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం
మాకు ఫార్మాసిటీ వద్దే వద్దు. మా భూములు మాకే ఉండా లి. సాగు భూములు కంపెనీలకు ఇచ్చి మేము ఎలా బతకాలి. గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటున సర్వేలు చేసి భూములను తీసుకోవడం సరికాదు. ప్రాణాలు పో యినా సరే భూములు మాత్రం ఫార్మాసిటీకి ఇచ్చేది లేదు. వాటి వల్ల రైతులకు నష్టం తప్ప లాభం లేదు.
– పుండికూర రవి, రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం
ఫార్మాసిటీ కోసం సాగు భూ ములు లాక్కొని మమ్ముల్ని బజారు పాలు చేయొద్దు. ఏడాదికి రెండు, మూడు పం టలు పండించుకునే భూములనే నమ్ముకుని రైతులంద రం ఉన్నదాంట్లో సంతోషం గా బతుకుతున్నాం. ఇప్పు డు పచ్చని పంట భూములను కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలకు ఇస్తే రైతులు ఏం కావాలి. మా కుటుంబమంతా ఎక్కడికి వెళ్ల్లాలి.
– వెంకటమ్మ, మహిళా రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం