చేగుంట, మే6: రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర్ మూలమలుపు వద్ద గుంతలను ఎంపీ శనివారం పరిశీలించారు. రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత పాటించి, త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట మండలం కర్నాల్పల్లిలోని షిర్డీ సాయిబాబా దేవాలయ కమ్యూనిటీ భవనానికి ఎంపీ నిధులు రూ.5 లక్షలు మంజూరు చేశారు. సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కర్నాల్‌పల్లి ఎస్సీ కమ్యూనిటీ, బోనాల్లో బీసీ భవనానికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. దేవాలయానికి వచ్చిన ఎంపీని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
బాధిత కుటుంబాలకు ఎంపీ ఆర్థిక సాయం
చెట్లతిమ్మాయిపల్లి, పులిగుట్ట తండాలో పూరి గుడిసెలు కాలిపోయాయి. బాధితులు కరోంతోత్ చందర్, రతన్‌ను ఎంపీ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, ఎంపీడీవో ఆనంద్మేరి, సర్పంచులు దోరగొల్ల రాములు, సంతోష్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేశ్‌గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు యెర్వ బాల్‌రెడ్డి, కాడిగిద్ద యాదిరెడ్డి, అంబటి ఆంజనేయులు, వంటరి రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగలింగం, తుమ్మ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు వంటరి అశోక్‌రెడ్డి, కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ జనగామ రాములుగౌడ్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ పట్న తానీషా, వంటరి మహిపాల్‌రెడ్డి, నార్సింగి మండల నాయకులు మైలారం బాబు, అంచనూరి రాజేశ్, సర్పంచులు కుమ్మరి శ్రీనివాస్, అబ్బరబోయిన మల్లయ్య, జింక శ్రీనివాస్, బండి విశ్వేశ్వర్, సత్తిరెడ్డి, కాశబోయిన సుదర్శనం, సర్పంచ్ మెహన్రాథోడ్, ఎంపీటీసీ హోళియానాయక్, మైనార్టీ నాయకుడు నదీం తదితరులు పాల్గొన్నారు.