మెదక్, మున్సిపాలిటీ, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
తక్షణమే ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోడవతో కార్మికుల కుటుంబాల పోషణకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులకువేతనాలు విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సీఐటీయూ నాయకులు బాలమణి, సత్త య్య, నాగరాజు, నర్సింహులు, బాబు, ప్రభాకర్, మల్లేశం, యాదయ్య, భిక్షపతి, రాములు తదితరులతో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.