Grain Purchase | నర్సాపూర్, నవంబర్ 18: అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా తయారైంది మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం దుస్థితి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడానికి కాంట ఉంది, ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు ఉన్నాయి.. వాటిని ఎత్తడానికి హమాలీలు ఉన్నారు.. ధాన్యం తరలించడానికి లారీలు ఉన్నాయి… కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ధాన్యం తేమ శాతం చూసే మ్యాచర్ మిషన్ లేదు.
కొనుగోలు కేంద్రంలో మ్యాచర్ మిషన్ చెడిపోయినా కొత్తది తెచ్చి కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగించడానికి అధికారులు, నిర్వహకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పక్క గ్రామమైన తుజాల్పూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుండి మ్యాచర్ మిషన్ను రోజు తీసుకువచ్చి ఇక్కడ తేమ శాతాన్ని చూడడం జరుగుతుంది. ఇలా చేయడంతో తేమ శాతాన్ని చూడడంలో ఆలస్యం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధాన్యాన్ని ఆరబెట్టి ఐదు రోజులు అవుతుందని మ్యాచర్ మిషన్ లేకపోవడంతో ధాన్యం బరువు తగ్గి నష్టం వాటిల్లుతుందని రైతులు రాజు, అంజిరెడ్డి వాపోయారు.
ఇప్పటికే మ్యాచర్ 14 శాతం ఉందని, ఇంకా ఆగితే ధాన్యం చేతికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టార్పాలిన్లు కూడా అందజేయలేదని, తూకం వేసిన ధాన్యాన్ని రెండు రోజుల నుండి రైస్ మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి మ్యాచర్ మిషన్ను అందుబాటులో ఉంచి ధాన్యాన్ని త్వరగా తూకం వేయాలని రైతులు కోరుతున్నారు.

Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి