శుభ వాస్తు
ఈ రోజుల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ, తలమీద బరువులు మోస్తున్నారు. చాలా భవనాల్లో ‘నాలుగైదు అడుగులు ఉన్న చతురస్రం పిల్లర్లు’ తీసుకొని కట్టడం బాగానే ఉంటుంది. కానీ, అవన్నీ నిర్మాణం లోపలికి తీసుకొని బాల్కనీలు వదలకుండా కట్టి.. ఎటూ వాడుకోలేని స్థితిలో పెడుతున్నారు.
కమర్షియల్ బిల్డింగ్స్‌లో పెద్దపెద్ద పిల్లర్లు వస్తున్నాయి. అవి ఇబ్బంది కాదా?
– సీఎం సురేష్, సికింద్రాబాద్
ఈ రోజుల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ, తలమీద బరువులు మోస్తున్నారు. చాలా భవనాల్లో ‘నాలుగైదు అడుగులు ఉన్న చతురస్రం పిల్లర్లు’ తీసుకొని కట్టడం బాగానే ఉంటుంది. కానీ, అవన్నీ నిర్మాణం లోపలికి తీసుకొని బాల్కనీలు వదలకుండా కట్టి.. ఎటూ వాడుకోలేని స్థితిలో పెడుతున్నారు. నిర్మాణం చేయడం వేరు.. దాన్ని అనుకూలంగా వాడుకేనేలా కాలమ్స్ అడ్డురాకుండా ప్లాన్ చేయడం వేరు. ‘ఎస్.ఎఫ్.టి’ లెక్కలకోసం నిర్మాణం చుట్టూ గ్లాస్‌తో మూసి.. ఏ మూల నుంచో ఎక్కించి అందులో బంధీలై రోజును వెళ్లదీస్తున్నారు.
అదంతా విదేశీ మోజు. ఒక బాల్కనీ వచ్చే పెద్ద భవనానికి సవ్యమైన నడకదారి ఉండాలి. కింద నేల మీద తూర్పురోడ్డు ఉంటుంది. మిగతా అన్ని అంతస్తులకూ దక్షిణం లేదా నైరుతి ద్వారాలు పెట్టే దిశలు. దిక్కులు చూడకుండా ఒకరిని చూసి ఒకరు కడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. ఏనుగు ఆకారం వేరు.. సింహం ఆకారం వేరు. దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అన్నింటికే ‘ఒకే వైద్యం’ అన్నట్లు నేటి నిర్మాణాలు నడుస్తున్నాయి. అవన్నీ గొప్పగా కనిపిస్తాయేమో కానీ.. గొప్ప ఫలితాలు ఇవ్వలేవు. పైకి అందరూ బాగానే నిర్వహిస్తుంటారు. కానీ ప్రకృతి ఒప్పుకోదు. తనపని తాను చేస్తూనే పోతుంది.
ఇంటి ఉత్తరం బాల్కనీలో స్లాబ్ కట్ చేసి ‘వాటర్ ఫాల్స్’ పెట్టాం. అలా ఉండవచ్చా? ప్లాన్ చూసి సలహా ఇవ్వగలరు.
– కేఎల్ వాణి, ఉప్పల్
ఇంటి ఈశాన్యంలో నడక ఉండాలి. అందరికీ ఈశాన్యం అనగానే ఖాళీ ఉండాలని, అక్కడ నీరు ఉండాలనీ అనుకుంటారు. ఏది ఎక్కడ ఉండాలో శాస్త్రం నిర్ణయిస్తుంది. మీ ప్లాన్ చూశాను. ఈశాన్యం బాల్కనీలో రెండుగా కట్ చేసి దాని నుంచి నీళ్లు పడేలా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు. ఆచోట ఆ హాల్ చుట్టూ రెయిలింగ్‌ను పెట్టారు.

దానివల్ల ఈశాన్యం నడవకుండా కట్ అయిపోయింది. గుంత చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈశాన్యం మూల కట్ చేశారు. అది పనికిరాదు. ఆ రంధ్రం మూసేలా తిరిగి స్లాబ్ వేయండి. అక్కడ ఎలాంటి నిర్మాణం చేయకండి. ఓపెన్ బాల్కనీ ఉండనివ్వండి. ఈశాన్య భాగం వాడకంలో ఉన్నప్పుడే ఇంట్లో వేడుక ఉంటుంది.
శివుని తలమీద గంగ ఉంటుంది. శివుడు ఈశాన్యంలో ఉంటాడు కాబట్టి, ఇంటిమీద ఈశాన్యంలో నీళ్లట్యాంక్ పెట్టొచ్చు కదా?
– గంగాధర్ లక్ష్మి, రామ్‌నగర్
ఆయన మెడలో పాములు ఉంటాయని ఇంట్లో పాములు పెంచుకుంటామా? శివతత్వం ‘భూతత్వం’. శివుడు హిమాలయ వాసి అనే సంకేతం, నదులు హిమాలయాల నుంచి ఉద్భవిస్తాయి అనే విధానంలో శివుని తలపై గంగ ఉందని పెద్దల వివరణ. అంతేకాదు శివుడు లేని చోటు ఉందా? మీ ఆలోచన శాస్త్రపరంగా సరైనది కాదు.

మీరు ఈశాన్యంలో ఇంటి మీద ట్యాంక్ పెట్టకుండా నైరుతిలో దిమ్మలు కట్టి దానిమీద పెట్టండి. ఈశాన్యంలో నేలమీద నీటి సంపు పెట్టుకోవచ్చు. అంటే నేలమీద గుంత లేకుండా దక్షిణ-పశ్చిమాల్లో నీటి తొట్లు కూడా కట్టుకోవచ్చు. శాస్త్రం లోతైనది. అన్నీ తెలిసి ఆచరిస్తే మంచిది.
హాస్టల్ భవనాన్ని విశాలంగా ఎలా నిర్మించాలో తెలియజేయండి?
– బి. సత్యవతి, చెన్నూరు
విద్యార్థుల వసతి గృహం ‘U’ లేదా ‘L’ ఆకారంలో కట్టవచ్చు. ముఖ్యంగా హాస్టల్ భవనంలో వంటగది డైనింగ్ అవసరం ఉంటుంది. అందుకు తగిన విధంగా స్థలాన్ని ఎంపిక చేయండి. ఆ స్థలంలో ‘L’ ఆకారంలో నిర్మాణం చేయండి. అంటే దక్షిణం-పడమరలో నిర్మాణం రావాలి. తూర్పు-ఉత్తరం ఓపెన్ ఉండాలి. దక్షిణం భాగంలో తూర్పు వైపునకు కిచెన్ వచ్చేలా, అంటే ఆ భాగంలో ఆగ్నేయంలో వంటగది కట్టాలి.
దానికి ఆనుకుని పడమరలో పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేయండి. మిగతా భాగం అటు దక్షిణ-పడమరలో వసతి గదులు పెట్టండి. వార్డెన్ తదితర స్టాఫ్ గదులను పశ్చిమ-నైరుతిలో వచ్చేలా కేటాయించండి. టాయిలెట్లు పడమర భాగంలో వాయవ్య భాగాన ఏర్పాటు చేయండి. మెట్లు అటు దక్షిణ భాగంలో-సెంటర్లో. అదేవిధంగా పడమర భాగం సెంటర్లో వచ్చేలా కట్టండి. తప్పనిసరిగా ఆ ‘L’ ఆకార నిర్మాణానికి ‘కాంపౌండ్’ ఉండాలి. దానికి ఈశాన్యం లేదా తూర్పు సెంటర్లో గేటు ఏర్పాటు చేయండి. అన్నీ సవ్యంగా తెలుసుకొని ప్లాను బాగుంది అనిపించాకనే నిర్మాణానికి పూనుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

