సిద్దిపేట, నవంబర్ 28: ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చికుకుంటున్నాయి. జూన్ నుంచి పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గురుకులాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందిగా మారింది. ఇందుకు నిదర్శనం సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల. పాఠశాలలో శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా మారింది.
బాలికలు వాడుతున్న శానిటేషన్ ప్యాడ్స్ రెండు,మూడు రోజుల వరకు వాష్ రూమ్‌ల వద్దనే డస్ట్ బిన్లో ఉంటున్నాయి. కనీసం వాటిని మున్సిపల్ వాహనాలకు సైతం అందించేవారు లేకుండా పోయారు. విద్యార్థులు స్నానాలు చేయడం కోసం ఏర్పాటు చేసిన గదులు తలుపులు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు చలికాలం కావడంతో గ్లీజర్లు సరిగా పని చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాధులు ప్రబలి, విద్యార్థులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా మారింది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. కూరగాయల్లో నాణ్యత లేదు. తాజా కూరగాయలతో భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతున్నా అందుకు అనుగుణంగా భోజనం పెట్టడం లేదు. కూరగాయలు కూడా పూర్తిగా పాడైనవి పెడుతున్నారు. ఈ విషయంపై వార్డెన్‌ను ఆడగ్గా కూరగాయలు సరఫరా చేసే గుత్తేదారుకు ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదని, దీంతో రోజూ కూరగాయలను తిప్పి పంపిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం విద్యార్థుల భోజన సమయంలో మార్పులు చేయడంతో చాలామంది విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 7 గంటలకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అయ్యేసరికి అల్పాహారం టైం అయిపోతుంది. రాత్రిపూట భోజనం 6 గంటలకు పెడుతుండడంతో విద్యార్థులు మరుసటి రోజు ఉదయం 7గంటల వరకు అల్పాహారం అందించడం వల్ల, సుమారు 12 గంటల పాటు వారికి ఎలాంటి ఆహారం అందకపోవడంతో చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదురొంటున్నారు. డార్మెటరీ రూముల్లో ఫ్యాన్లు నడవక, వాటిని రిపేరు చేయించే వారు లేక విద్యార్థులు విద్యార్థులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. పాఠశాల ఆవరణలో నీటి సరఫరా పైపులు లీకేజీ కావడంతో చిత్తడిగా కనిపిస్తుంది.
పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారం రోజుల్లో పరిషరించేలా కృషి చేస్తాం, బడ్జెట్ రిలీజ్ కాకపోవడంతో హాస్టల్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సమస్యలు పరిషరించడంలో ఆలస్యమైంది. విద్యార్థులకు అందించే భోజనంలో నాసిరకం కూరగాయలు సప్లయ్ చేస్తున్న కాంట్రాక్టర్‌ను రిజెక్ట్ చేశాం.
-ఆస్మా ఫాతిమా, ప్రిన్సిపాల్