హుస్నాబాద్, ఆగస్టు 14: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. పెద్దాపురం గురుకులంలో జరిగిన సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు ఈజీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నిధులను గురుకులా లు, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాలయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు నిత్యం గురుకులాలను సం దర్శించాలని, అక్కడి సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గురుకులాల్లో పరిశుభ్రత కోసం స్థానికంగా నిధులు కేటాయించి పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. సొంత భవనం లేని ప్రభుత్వ గురుకులా లు, హాస్టళ్లు, పాఠశాలల భవన నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించామని, స్థలం లభించగానే భవన నిర్మాణాలకు నిధులు వెంటనే మంజూరు చేస్తామని వివరించారు.
హాస్టళ్లలో మెస్, కాస్మోటిక్ చార్జీలు పెం చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ ని యోజకవర్గంలో చదువుకొని ఉద్యోగం లేక వ్యవసాయం చేస్తున్న యువతకు కూడా వ్యవసాయాధారిత రంగాలు, పరిశ్రమల్లో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు ఇప్పించేందుకు కూడా ఆలోచన చేస్తున్నామన్నారు.