సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 17: సంగారెడ్డి జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోఫుతున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ చెప్పారు. గురువారం జిల్లాలో స్వాధీ నం చేసుకున్న 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాములు హాష్ ఆయిల్ వివరాలను ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం ఉదయం 10 గంటలకు న్యాబ్ సిబ్బందితో కలిసి మనూర్ ఎస్సై డావూర్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారన్నారు.
నాగల్గిద్ద వైపు నుంచి నారాయణఖేడ్ వైపు వస్తున్న కేఏ29ఎన్ 1640 నంబరు గల ఒక స్విఫ్టు డిజైర్ కారును తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో 40 కిలోల ఎండు గంజాయి లభించిందన్నారు.
కర్ణాటకలోని బీదర్ జిల్లా బాల్కి పట్టణానికి చెందిన కారు డ్రైవర్ మల్లగొండగా గుర్తించామన్నారు. మల్లేశ్ అనే వ్యక్తితో కలిసి మల్లగొండ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి గంజాయి తెచ్చి అమ్మి అధిక డబ్బులు సంపాదిస్తున్నారన్నారు.
సెప్టెంబర్‌లో చిరాగ్పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్న 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు తమవే అని ఇతను ఒప్పుకొన్నాడని ఎస్పీ తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సాగు చేసి నా, సరఫరా చేసినా ఎస్-న్యాబ్ నెంబరు 8712656777కు సమాచారం అందించాలని, వివరాలు వెల్లడించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎస్-న్యా బ్ సీఐ రమేశ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ విజయ్‌కృష్ణ, అమీన్పూర్ సీఐ నాగరాజు, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎస్ ఎస్సై శ్రీకాంత్, మనూర్ ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.