Drugs | పాపన్నపేట, జూన్ 24 : మత్తు వల్ల విద్యార్థుల బతుకులు చిద్రమవుతాయని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం కుర్తివాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సూచనల మేరకు ఈ నెల 20 నుండి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వారోత్సవాల్లో భాగంగా పాపన్నపేట మండలం కుర్తివాడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ ఫోన్ల వినియోగానికి అలవాటు వడ్డ, కొంత మంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్,గంజాయి, చాక్లెట్లు, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, విస్కీ లాంటివి సేవించడం లాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వల్ల బంగారు భవిష్యత్తు పాడవుతుందని వీటికి దూరంగా ఉండాలని సూచించారు.
వారోత్సవాలను పురస్కరించుకొని, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలు విష్ణువర్ధన్, నూమన్, ఆర్థిక ప్రియలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, హెచ్ఎం శ్రీనివాస్ రావు, మేగ్యా, వెంకట్రాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు