సంగారెడ్డి, మార్చి 7: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును గురువారం మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సంగారెడ్డిలోని ఆర్.సత్యనారాయణ నివాసానికి వచ్చారు. ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు గాలి అనిల్‌కుమార్, జైపాల్‌రెడ్డి, శివరాజ్‌పాటిల్, చింతా గోపాల్, శ్రీహరి, ఆదర్శ్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే చింతాప్రభాకర్, బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్‌పాటిల్‌ను ఆర్.సత్యనారాయణ శాలువాతో సన్మానించారు.