నాగల్గిద్ద, జనవరి 27: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్‌రెడ్డి గంగలో కలిపి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని ఖూబాతండాకు చెందిన మాజీ సర్పంచ్ శకుంతల, కిషన్‌నాయక్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గెలుపోటములతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫూర్తిగా విఫలమైందన్నారు. రైతుబంధు రూ.15 వేలకు పెంచుతామని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తండాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నా పట్టించుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సింహులు ముదిరాజ్, మాజీ సర్పంచ్ రాజు, సుజాత, బంగారు రాజు, మల్లేశ్, గౌరి ప్రసాద్, విజయ్ ఉన్నారు.