మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): స్థాని క ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోకాపేటలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ బీమరి యాదగిరి, డైరెక్టర్లు విఠల్ నాయక్, శ్రీశైలం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని, వాటి అమలులో విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కైవసం చేసుకోవడానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఎకడా లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక పనిని కూడా కాంగ్రెస్ సరారు కొనసాగించకపోగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని విమర్శించారు. స్థానికల సంస్థల ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు నాట్లప్పుడు పడేదని, కానీ ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, మడూర్ర్ పీఏసీఎస్ చైర్మన్ కొంసాని శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, నాయకులు సుధాకర్, రమేశ్, చందర్ తదితరులు పాల్గొన్నారు.