కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసం చేసింది
ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు భారీ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు.
- బీజేపీ ఓటేస్తే పెనం మీదం నుంచి పొయ్యిలో పడ్డట్టే..
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- శివ్వంపేట రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు
శివ్వంపేట, ఏప్రిల్ 28: ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు భారీ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేస్తే మోసపోయామన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మళ్లీ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారని, రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌కు ఓట్ల రూపంలో తరుగు తీయాలని రైతులను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నతాధికారిగా ప్రజలకు సేవ చేశారని,
అతన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓట్లు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గోవిందా అనే పాటపాడి అందరినీ ఆకట్టుకున్నారు. అంతకుముందు జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో, ముస్లిములు పీర్ల ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

