హైదరాబా ద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వు డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం స్టా క్లో లేదని, ప్రభుత్వానికి సైతం బి య్యం రూపంలో తిరిగి ఇవ్వలేదన్నారు.