ఖైరతాబాద్, ఆగస్టు 6 : మహంకాళి బోనాల పండుగ రోజు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని, అడుగడుగునా ఆటంకాలు కల్పించారని, జోగినిలకు తీవ్ర అవమానాలు కలిగాయని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే జోగిని, శివసత్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించేవారని, డప్పుచప్పుళ్ల మధ్య వాయిద్యాలతో ఊరేగింపగా అమ్మవారికి బోనం సమర్పించేవారన్నారు. ప్రస్తుతం అలాంటి సౌకర్యాలు ఇవ్వకపోగా, అనేక ఆంక్షలు, అడ్డంకులు కల్పించారన్నారు. ఇది కావాలనే చేసినట్లు తాము భావిస్తున్నామన్నారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పోలీసులు ఇచ్చిన అనుమతుల మేరకు వారు చెప్పిన సమయానికే వచ్చామన్నారు. ప్ర భుత్వ ఏర్పాట్లు అసంతృప్తిని కలిగించిందన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో సహకరించారని, పోలీసులతో స్వయంగా మాట్లాడి తమకు సౌకర్యాలు కల్పించేందుకు చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. తమ జీవితమే అమ్మవారికి అంకితమిచ్చామని, ఊరేగింపు సందర్భంగా తాము నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలువడం ఆనవాయితీని, కాని దానిని సై తం డ్రామాలంటూ కొందరు కథనాలు అల్లుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. ముం దస్తు సమీక్షా సమావేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పండుగ రోజు జోగినులను పోలీసులు గేట్ల వద్దే అడ్డుకున్నారన్నారు. ఒకే లైన్ ఉం టే..అందులో ఏడెనిమిది బారికేడ్లు పెట్టారని, అడ్డుగా తాడు కట్టారన్నారు.
సామాజిక మాధ్యమాల్లో శ్యామల బోనం పడిపోయిందని ప్రచారం జరిగిందని, అయితే అది వాస్తవం కాదని, ఇప్పటి వరకు అలాంటిది ఎప్పుడు జరుగలేదన్నారు. అధికారుల ని ర్లక్ష్యం, పోలీసుల అత్యుత్సాహం వల్ల అత్యధికంగా భక్తులను నియంత్రించలేకపోయారని, ఫలితంగా తోపులాటలు జరిగాయని, సరైన మార్గ నిర్దేశం లేకపోవడం వల్లే తాను కిందపడిపోయానని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహంకాళి బోనాల పండుగలో జోగినులు, శివసత్తులు పాత్ర అత్యంత కీలకమైందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారి సేవలో మునిగి తేలే తమను ఆలయ ప్రాంగణంలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా అవమానించేలా ప్రవర్తించడం ఎం త వరకు సమంజసమన్నారు. ఇది కేవ లం తమకు జరిగిన అవమానం కా దని, తె లంగాణ ఆధ్యాత్మిక సంప్రదాయాలను అవమానించడమేనన్నారు. ఇలాంటి ఘటనలు భక్తు ల మనోభావాలను దెబ్బతీస్తాయని, భవిష్యత్తులో ఏ పండుగలోనూ జోగినులకు లే దా శి వసత్తులకు ఇటువంటి అనుభవాలు ఎ దురుకాకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆ లయ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు.