వెల్లువెత్తిన అభిమానం
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్పై అభిమానం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లాలోని ఊరూరా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించా రు.
- ఊరూరా జయశంకర్ జయంతి వేడుకలు.. విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థల్లో కార్యక్రమాలు
నమస్తే నెట్వర్క్, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్పై అభిమానం వెల్లువెత్తింది. ఉమ్మడి జిల్లాలోని ఊరూరా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వివిధ సంస్థలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించా రు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
హనుమకొండలోని ఏకశిల పార్కులోని సార్ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట క్రాస్ రోడ్డులో మాజీ ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నెక్కొండలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రొఫెసర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి మరువలేనిదన్నారు. స్వరాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు కాగా, జనగామలో ప్రొఫెసర్ విగ్రహ ఏర్పాటుతోపాటు ప్రతిష్ఠాపనకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్థలాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

