సిద్దిపేట, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20 వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండానే అని, కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని.. మళ్లీ కేసీఆర్ రావాలి.. కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతి వార్డులో పార్టీ కార్యాలయాలు ఉంటాయని, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు..
అనంతరం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరారు. మహ్మమద్ ఇంతియాజ్, అజిమొద్దీన్, రెహాన్, ఆరీఫ్, మోహిన్, సల్మాన్, నవాజ్, ఖాజాపాషా, రహీంలకు గులాబీ కండువా కప్పి హరీశ్‌రావు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.