Mrigashira Karte | మెదక్ రూరల్, జూన్ 7: మృగశిర కార్తె అనగానే వానకాలం వస్తున్నదని గుర్తుకొస్తుంది. మృగశిర ప్రారంభం రోజున చేపలు కచ్చితంగా తినాలనేది పూర్వం నుంచి వస్తున్నది. అయితే దీని వెనకాల అనేక రకాల కారణాలు ఉన్నాయి. కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్టే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి చేపలు ఎంతో మంచివి. వేసవి ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందని, చేపలు తినడంతో తగ్గుతుందని చెబుతుంటారు. దీంతోపాటు హృదయానికి సంబంధించిన వ్యాధుల నివారణకు చేపలు తినడం మంచిదని వైద్యులు చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరానికి పోషక విలువలు పొందేందుకు చేపలు తినడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ కార్తె రోజు చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపల మార్కెట్లను సిద్ధం చేశారు.
శాకాహారుల కోసం ఇంగువ, బెల్లం..
శారీరక ఆరోగ్యం కోసం మృగశిర కార్తెలో శాకాహారులు ఇంగువ, బెల్లం రెండింటిని కలిపి చిన్నచిన్న ముద్దలు చేసి పరిగడుపున తింటారు. ఇంగువకు చలువ చేసే శక్తి.. బెల్లానికి జీర్ణం చేసే శక్తి ఉంటుంది. మృగశిర రోజున ఇంగువ, బెల్లం మంచింది.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు