నారాయణరావుపేట, మార్చి 9 : రంగనాయకసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయించినందుకు నారాయణరావుపేట మం డలం బంజేరుపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్‌రావు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
పంటలకు సాగునీరు అందడంపై సంతోషం వ్యక్తం చేస్తూ హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు ఉన్నారు.