Farmers | చిలిపిచెడ్, అక్టోబర్ 28 : చిలిపిచెడ్ మండలంలోని రైతులు వర్షాలు దృష్టిలో పెట్టుకొని తమ వరి కోతలను నిలిపివేయాలని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని జగ్గంపేట గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఏవో రాజశేఖర్ గౌడ్ సందర్శించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.
అనంతరం ఏవో రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తడిచిన వడ్లు మొలకెత్తకుండా 50 గ్రా.ఉప్పు లీటరు నీటికి( 5% ఉప్పు ద్రావణం) కలిపి పిచికారి చేయాలని సూచించారు. అదేవిధంగా 2,3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు వరి కోతలు తాత్కాలికంగా ఆపివేయాలని సూచించారు.
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17% మించి ఉండరాదని, ధాన్యం ఆరిన తర్వాత తాళ్లు, మట్టి పెళ్లలు లేకుండా నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనిత, సెంటర్ ఇంఛార్జి అశోక్, రైతులు మాణిక్యం రెడ్డి, సాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Shaligouraram | తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయడంలే.. శాలిగౌరారంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
Cyclone Montha | దూసుకొస్తున్న ‘మొంథా’.. అల్లకల్లోలంగా ఒడిశా తీరం.. Video