Farmers | చిలిపిచెడ్, అక్టోబర్ 9: గత కొద్ది రోజుల కింద ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం కారణంగా సింగూర్ ప్రాజెక్టు నుంచి నీరు రావడంతో చిలిపిచెడ్ మండలంలోని మంజీర నది పరివాహ ప్రాంతాలు అయినా గంగారం, అజ్జ మరి, బండ పోతుగల్, ఫైజాబాద్, చిలిపిచెడ్, చండూర్, చిట్కుల్ గ్రామ శివారులో పత్తి, వరి పంటలు పూర్తిగా కుళ్లిపోయాయి.
అలాగే మండలంలోని బండ పోతుగల్ గ్రామంలో సింగూరు ప్రాజెక్ట్ వరదకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫారంలో పూర్తిగా ధ్వంసం కావడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన సమయంలో వరద నీరుకు పంట మొత్తం కుళ్లిపోయిందని రైతులు కన్నీరు పర్యంతమయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తమ పొలంలో కింద పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మార్ను విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా మళ్లీ ఎలా ఉందో అలాగే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే పంట నష్టం పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Also :
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్