దుబ్బాక, జూలై 31: ఓ పక్క వర్షాభావం..మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దుబ్బాక నియోజకవర్గ రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ సర్కారు లో కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గాన్ని ముద్దాడిన గోదావరి జలా లు నేడు కనిపించడం లేదు. బీఆర్ఎస్ సర్కారులో రెం డేండ్లుగా మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లికి నీరు విడుదల చేయడంతో నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా రెండు పంటలు పండించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నుంచి నీరు విడుదల చేయక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా 54 కి.మీటర్ల పొడవుతో ఉన్న కూడవెల్లివాగు జీవనదిగా మారింది. దీంతో పా టు మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నుంచి ప్యాకేజీ (దుబ్బాక కెనాల్) ద్వారా దుబ్బాక, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల (ముస్తాబాద్) నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలకు నీరు సరఫరా చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా మొత్తం 1.27 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు.
రెండేండ్లుగా వానకాలం, యాసంగి పంటలకు సాగునీరు సమృద్ధిగా ఉండేది. మల్లన్న సాగ ర్ ప్రధాన కాల్వను ఐదు విభాగాలుగా (చిన్న కాల్వలను) విభజించి, 46 కి.మీ పొడవుతో నిర్మించారు. గొలుసు కాల్వల ద్వారా 93 చెరువులు, కుంటలను నింపడంతోపాటు 1.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. తొగుట మండలం ఎల్లారెడ్డిపేట నుంచి బంజేరుపల్లి, మెట్టు, ఘనపూర్, వెంకట్రావ్పేట గ్రామా ల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఇర్కోడు, తోర్నాల నుంచి దుబ్బాక మండలంలో తిమ్మాపూర్, అప్పనపల్లి, హస్మీరాపూర్, పెద్దగుండవెళ్లి, బల్వంతాపూర్, పద్మశాలిగడ్డ, చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట, చిప్పలపల్లి, గోపాలపూరం గ్రామాల మీదుగా చివరకు మిడ్ మానేరుకు నీరు సరఫరా అయ్యేది.
మల్లన్నసాగర్ ద్వారా నియోజకవర్గంలో పలు కాల్వల ద్వారా తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో 66, 423 ఎకరాలకు సాగు నీరు అందేది. మరో పక్క దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట మండలాలకు కొండపోచమ్మసాగర్ నుంచి గజ్వేల్ మీదుగా ప్రధాన కాల్వ ద్వారా మరో 60 వేల ఎకరాలకు పైపులైన్ ఏర్పాటు చేశారు. గత యాసంగిలో కూడవెల్లికి సాగునీరు సరఫరా చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు సంబంధిత మంత్రి, సీఎంకు విన్నవించినా పట్టించుకోలేదు.
సాగునీటి కోసం రైతులతో కలిసి ఆందోళన చేయడంతో కూడవెల్లికి నీరు విడుదల చేశా రు. అప్పటికే చాలామేరకు పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వర్షాభావం కారణంగా వరినాటు వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కాళేశ్వ రం జలాలను మల్లన్నసాగర్‌కు విడుదల చేయకపోవడంతో సమస్యగా మారింది. గత వానకాలంలో ఎటు చూసినా పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. ప్రస్తుతం సాగునీరు లేక బీడుబారిన భూములతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీరు లేక నియోజకవర్గంలో సగానికంటే తక్కువగా పంట సాగు విస్తీర్ణం తగ్గింది.
దుబ్బాక, జూలై 31: కేసీఆర్ సర్కారులో మల్లన్నసాగర్ నుంచి పెద్దగుండవెల్లికి సాగునీరు వదిలారు. పంటలకు కావాల్సిన నీళ్లు రావడంతో చాలా సంతోష పడ్డాం. ఇప్పుడు కాల్వల నుంచి సాగునీరు వదలక పంటసాగు చేయలేదు. వానలు లేవు, కాల్వల్లో నీళ్లు రావడం లేదు. నీళ్లు లేక ఆరు ఎకరాలు బీడుగా మారింది. సాగునీళ్లు లేక మా గ్రామంలో 25శాతం కూడా పంటసాగు చేయడం లేదు. రైతులపై రాజకీయం చేయడం సరైంది కాదు. ఇప్పటికైనా కాల్వల ద్వారా నీళ్లు విడుదల చేయాలి.
– గుండాల ప్రకాశ్, రైతు, పెద్దగుండవెల్లి, సిద్దిపేట జిల్లా
దుబ్బాక, జూలై 31: కేసీఆర్ సర్కారులోనే మల్లన్నసాగర్ ద్వారా సాగు నీళ్లు వచ్చాయి. గత రెండేండ్లు మం చిగా పంటలు పండించుకున్నాం. ఇప్పుడు నీళ్లు లేక పంటసాగు చేయ డం లేదు. వానలు పడక కాలం కావడం లేదు. ఇప్పటికే వరినాట్లు పడాల్సి ఉండేది. ఆగస్టు రెండో వా రం దాటితే వరి నాట్లు వేసినా పంట చేతికి రాదు. నాకున్న మూడు ఎకరాల్లో ఎకరం వరి పంట సాగు చేయాలనుకున్నా. వరి నారు ము దిరిపోయింది. పంట పెట్టుబడి నష్టపోయా. మల్లన్నసాగర్ కాల్వల ద్వారా చెరువులకు నీళ్లు వదిలి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.
– బిర్ల మల్లయ్య, రైతు, పెద్దగుండవెల్లి, సిద్దిపేట జిల్లా
దుబ్బాక, జూలై 31: మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నీళ్లు వదలక పంటలు సాగు చేయలేదు. నాకు ఉన్న మూడు ఎకరాలు బీడుగా మా రింది. వానలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మరింత సమస్యగా మారింది. దుక్కులు దున్ని వదిలివేయడంతో కలుపు మొ క్కలు పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. మల్లన్నసాగర్ నీళ్ల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ సర్కారులోనే రైతులకు మేలు జరిగింది. మల్లన్నసాగర్ కాల్వల ద్వారా చెరువులకు నీళ్లు వదిలి ఉంటే బాగుండేది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతులందరూ సంతోషంగా ఎవుసం చేసుకున్నరు.
– గంట పెద్ద రవి, రైతు, పెద్దగుండవెల్లి, సిద్దిపేట జిల్లా