న్యాల్కల్, జూలై 31: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. అందులో భాగంగా రెండు విడతల్లో ప్రభుత్వం రూ. లక్ష, లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేసింది. ఇందులో చాలా మంది రైతులు అర్హులుగా ఉన్నా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు మాఫీ కాలేదు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల రైతులు న్యాల్కల్, చాల్కి, హద్నూర్, కోత్తుర్ గ్రామాల్లోని బ్యాంకు అధికారులు, సంబంధిత మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాల్కల్, హద్నూర్ గ్రామాల్లోని వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన బ్యాంకుల్లో వడ్డీతో సహా రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. కానీ హద్నూర్, కొత్త్తూర్ గ్రామాల్లోని కెన రా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల చా లా మంది రైతులు నష్టపోతున్నారు.
ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధిం చి వడ్డీతో సహా కలిపి ప్రభుత్వానికి లెక్కలు పంపకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చాలామంది రైతుల కొత్త రుణాల ఖాతా నంబర్లు కాకుండా పాత ఖాతా నంబర్లు పంపించడంతో మాఫీ అయిన డబ్బులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు.
కెనరా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల మా ఫీ అయిన డబ్బులు వెనక్కిపోయాయి. బ్యాం కులో రూ.75 వేల పంట రుణం తీసుకున్నా. వడ్డీతో సహా రూ.1.20 లక్షల వరకు బ్యాంకు లో అప్పు ఉన్నది. తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా చెల్లించి తిరిగి రెన్యువల్ చేసుకున్నా. రూ. లక్షలోపు పంటరుణమాఫీ జాబితాలో పేరు వచ్చింది.
బ్యాంకుకు వెళ్లి చూస్తే డబ్బులు రాలేదని అధికారులు చెప్పారు. సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించా. ఆధార్ నం బర్తో స్టేటస్ పరిశీలిస్తే రూ.75 వేలు పంట రుణమాఫీ అయింది. బ్యాంకు ఖాతా తొలిగించడంతో డబ్బులు వెనక్కివెళ్లిపోయాయ ని చెప్పారు. బ్యాం కులో తీసుకున్న రు ణానికి వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తే అధికారులు మాత్రం రూ.75 వేలు తీసుకున్నట్లు ప్రభుత్వానికి లెక్క లు పంపడం దారుణం.
– అవుటి అంజన్న, రైతు, హద్నూర్, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా