దుబ్బాక,మే 23: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు, కన్నీళ్లే దిక్కయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల ప్రారంభోత్సవాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన ఆసక్తి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్, చేర్వాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలతో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హడావుడి చేయడం తప్పా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో మహంకాళి విగ్రహా ప్రతిష్ఠలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పీఏసీఏస్ చైర్మన్ కైలాష్, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, భూం రెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.