మెదక్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ చీకటి రోజులొస్తాయి. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌కే మా మద్దతు. అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి పూట కరెంటు కోసం పొలాల దగ్గరికి వెళ్లి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మళ్లీ అలాంటి రోజులు రావద్దంటూ రైతులు తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ఇస్తామంటున్న 3 గంటల కరెంటుతో కనీసం మూడు గుంటలు కూడా పారవని, తెలంగాణ రాష్ర్టం ఇస్తున్న 24 గంటల కరెంటుతోనే వ్యవసాయం బాగా సాగుతున్నదని చెబుతున్నారు.
ధరణితో ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. ఇప్పుడు ధరణి పోర్టల్ స్థానంలో భూ మాత తీసుకొచ్చి రైతులకు పంచాయతీ పెట్టవద్దని రైతులు సూచిస్తున్నారు. మళ్లీ పాత పద్ధతి పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. గతంలో భూ రిజిస్ట్రేషన్లు కావడానికి ఏండ్ల తరబడి తహసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. లంచాలు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదిలేది కాదు. ఒకరి పేరిట ఉన్న భూములను పట్టాదారుకు తెలియకుండా పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేవారు. గతంలో భూముల వివరాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో నిత్యం భూ తగాదాలు జరుగుతుండేవి. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ భూ రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. రికార్డులను ఆన్లైన్ చేసి ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేయడంతోపాటు కొత్త పాస్ బుక్కులు అందించారు. ధరణికి ముందు మ్యానువల్ రికార్డులు ఉండెవి. ఎవరి భూమి ఎవరికీ సొంతమో తెలియని అయోమయ పరిస్థితి ఉండేది.
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. దీంతో విద్యుత్ తీగలతపై బట్టలు ఎండేసిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లకు నమ్మకం లేకుంటే గ్రామాల్లోకి వచ్చి వృద్ధ రైతులను అడిగి తెలుసుకోవాలి. గ్రామాలకు రాక ఎక్కడో ఉండి అబద్దాలు మానుకోవాలి. లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైతుల పాలిట ఒక దేవుడిలాగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను నిందిస్తే ఊరుకోం.
రైతులు 10 హెచ్‌పీ మోటర్లతో పడ్డ కష్టాలు మాకు తెలుసు. 3, 4 గంటల కరెంటుతో మా భూములు పారుతాయా.?
గతంలోనే ఎన్నో సందరా జలాలు మోటర్లతో భూగర్భజలాలు కూడా తొందరగా తగ్గుతాయి. కరెంటు చార్జీలు విపరీతంగా
పెరుగుతాయి. ఇదే కాంగ్రెస్ వాళ్లకు కావల్సింది. అప్పుడు రైతులు ఎదుగకుండా చెప్పినట్లు తమ ఆధీనంలో
ఉంటారని కుట్ర. కాంగ్రెస్ రోజులు దగ్గర పడ్డాయి.
ఎవుసం గురించి తెలుసా, తెలిస్తే అట్ల మాట్లాడరు. మూడు గంటల కరెంట్‌తో మడి కూడా పారదు. పంటలు సాగు చేయలేక పొలాలు బీళ్తుగా మిగులుతాయి. మళ్లా మునుపటి రోజులు వస్తే కరెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.
మంచిగుంటది. అవసరమున్నప్పుడు మోటర్లతో నీళ్లు పారబెడతా. పదేండ్ల నుంచి రైతులకు కష్టాలు పోయి నిమ్మలంగా
ఎవుసం చేసుకునే రోజులు వచ్చాయి.
24 గంటలు కరెంటు ఇస్తున్న కేసీఆర్‌కే రైతులమంతా ఓటేస్తాం. మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులంతా ఆగమైపోతారు. 3 గంటల కరెంటు ఇస్తే ఎవుసం ఎలా చేయాలి? గతంలో కాంగ్రెస్ రైతులకు నాలుగైదు గంటల కరెంటు ఇచ్చేది. రాత్రిపూట ఇవ్వడంతో నానా అవస్థలు పడ్డాం. 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ సారుకే ఓటేస్తాం…
గతంలో ఎకరా పంట పండిద్దామంటే కరెంట్ సరిగ్గా ఉండేది కాదు. లక్షలు వెచ్చించి బోర్లు వేసినప్పటికీ కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ పంటలకు ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో మేమంతా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేసెందుకు కుట్రలు చేస్తున్నారు.
రైతులకు 24 గంటల కరంటు ఇచ్చుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌తోనే అయితది. రైతులకు పంట పెట్టుబడి సాయం ఆరు నెల్లకోసారి ఎకరంకు రూ.5వేలు వేస్తుండు. గా.. రేవంత్‌రెడ్డి ఎవుసంకు 3 గంటలు కరంటు సరిపోతుందని మాట్లాడిండంట.. గాయనకు ఎవుసం గురించి ఎమన్న తెలుసా..? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంకే 24 గంటల కరంటుతో పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నాం. రేవంత్‌రెడ్డి నోటికి ఏదస్తే అది మాట్లాడుతాండు. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎవ్వరూ నమ్ముతలేరు. రైతులను కాపుడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటం.
– అబ్దుల్ అజీజ్, రైతు, నిజాంపేట
కాంగ్రెస్‌తో మళ్లీ వలస వెళ్లే పరిస్థితి
24 గంటల కరెంటు బంద్ చేయించాలి, 10 హెచ్‌పీ మోటర్లు బిగించాలి కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. ధరణి రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. రైతులు వలస వెళ్తేది గ్రామాల్లోని పేద రైతుల భూములు గుంజుకోవండానికి గతంలో వాళ్లు చేసింది అదేపని. ఇప్పుడు అది సాధ్యం కావడం లేదని మింగుడు పడటం లేదు . కాంగ్రెస్ పాలనలో చీకటి, కరెంటు, ఎండిన భూములు, రైతుల ఆత్మహత్యలు తప్ప ఏమీలేవు. తెలంగాణ వచ్చిన తరువాత అవి ఏమీ జరగడం లేదని విషం కక్కుతున్నారు.
– గట్టగారి లింగం, రైతు, కాట్రియాల, రామాయంపేట
మూడు గంటల కరెంట్ సరిపోదు
మూడు గంటల కరెంట్ ఏ కోశానా సరిపోదు. ఇప్పుడు వస్తున్న కరెంటుతో నిమ్మలంగా పంటలు పండించుకుంటు న్నాం. అంతకుముందు కరెం టు కోసం ఎదురుచూసుకుం టూ కూర్చునేటోళ్లం. కరెంట్ వస్తుందంటే పొలాల కాడికి ఎగపడేటోళ్లం. రాత్రి లేదు పగలు లేదు. ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్లి మోటర్లు చాలు చేసుకునే టోళ్లం. ఎన్నోసార్లు, కరెంట్ కోసం చూసి చూసి పంటలు ఎండిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు మళ్లీ వద్దు.. అందుకే కేసీఆరే మాకు ముద్దు.
– మల్లయ్య, రైతు, ఉప్పులింగాపూర్, వెల్దుర్తి మండలం
రైతాంగం అంతా బీఆర్ఎస్ వైపే..
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతులను మోసం చేస్తుంది. 3 గంటల కరెంట్‌తో మళ్లీ పాత రోజుల వచ్చే ప్రమాదం లేకపోలేదు. మూడు గంటలు కరెంట్ ఇస్తే రైతులు సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. రైతాంగానికి 3 గంటల కరెంట్ అసలే సరిపోదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు 24 గంటల కరెంటు వస్తంది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతంది. తెలంగాణ యావత్ రైతాంగం అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాం. రైతు కష్టం తెలిసిన కేసీఆరే మళ్లీ అధికారంలోకి రావాలి.
– చాకలి లింగం,రైతు, అంబాజీపేట, చిన్నశంకరంపేట
ధరణితోనే భూములకు భద్రత
ధరణితో భూములకు భద్రత పెరిగింది. కాంగ్రెస్ నాయకులు ధరణిని రద్దు చేసి పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామంటున్నారు. దీంతో భూములకు రక్షణ ఉంటుందా? పట్వారీ విధానం అమలైతే రైతులకు భూమి మీద ఉన్న ధీమా పోతుంది. కాంగ్రెస్ నాయకులు తీసుకొస్తాన్న కౌలుదారు కాలమ్ భయపెడుతున్నది. పట్నంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే కొంతమంది రైతులు వాళ్లకున్నా కొద్దిపాటి భూములను కౌలుకు ఇయ్యాలంటే భయపడుతారు. దీంతో బీడు భూములుగా మారుతాయ్. సాగు విస్తీర్ణం తగ్గి పనులు దొరకకా మళ్ల కరువు వస్తది. భూములు ధరలు కూడా తగ్గుతాయి.
– తిరుమల్ రైతు, నిజాంపేట
కరెంటు పుల్గా ఉంటున్నది
కరెంటు ఫుల్‌గా ఉంటుంది. 24 గంటల కరెంటు ఉండే పటికనే గిట్ల వరి పంట మస్తుగ పండిస్తున్నాం. రెవంత్‌రెడ్డి ఎన్నడన్న ఎవుసం చేసిండ. రైతుల కష్టం వాళ్లకు ఏమి ఎరుక. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాడట. ఇగ వ్యవసాయం బందు పెట్టుకుని మళ్ల బతుకపోయే పరిస్థితి వస్తది. రైతుల కోసం ఆలోచిస్తు, గిన్ని సవులతులు చేస్తున్న కేసీఆర్‌నే గెలిపించుకుంటం. బీజేపీ,కాంగ్రెసోళ్ల మాటలు పట్టుకుంటే మా బతుకులు ఆగమే.
– పెండల శంకర్, రైతు, అనంతసాగర్, చేగుంట మండలం,
కేసీఆర్ కృషితోనే పచ్చని పంట పొలాలు
సీఎం కేసీఆర్ కృషితో ఎటుచూసినా పచ్చని పంటలే కనిపిస్తున్నాయి. రైతులకు 24 గంటల కరెంటు అందించడంతోనే ఒక్క గుంటకూడా బీడుగా లేదు. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే రైతుల నెత్తిన భారీ భారం. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు ఇబ్బంది లేదు. మోటర్లు కాలుడు లేదు. ఇంత మంచి సౌలత్ ఉండంగ, మళ్లా గా కాంగ్రెసోళ్లు వచ్చి ఏం జేస్తరు. కాంగ్రెస్ వస్తే మళ్లా రైతులంతా అప్పులబారిన పడుడే. అలాంటి వాళ్లకు అధికారం ఇచ్చి మన నోట్లో మట్టి పోసుకునుడు అవుతది.
– గొల్ల కిష్టయ్య, రైతు, సోమక్కపేట, చిలిపిచెడ్ మండలం
ధరణి రద్దయితే రైతు బతుకులు ఆగమే
నాకు ఆరెకరాల భూమి ఉంది. ధరణితోనే మా భూమంతా రికార్డుల్లో భద్రంగా ఉంది. ధరణి రద్దయితే మా భూములకు రక్షణ ఉంటదా? ధరణి తీసేస్తే రైతు బంధు పోతది. భూముల విలువలు తగ్గుతయి. పెట్టుబడి సాయం ఇవ్వరు, ఎరువులు దొరకవు. పంట కూడా అడ్డికి పావుసేరుకు అమ్ముకోవాలె. కాంగ్రెసోళ్లకు ఏమన్నా ఉందా? రైతు బంధును ఆపుతారయా? ఇంకా ఏం మొఖం పెట్టుకుని ఒట్లడుగతరు. కేసీఆర్ మాకు అన్ని ఇచ్చిండు. మళ్ల కేసీఆర్ సారుకే ఓటేస్తం.
– మన్నె కిషన్, రైతు, యావాపూర్, తూప్రాన్ మండలం
కటుక ఒత్తుడే లేటు.. నీళ్లే నీళ్లు
ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంట్‌తో కటుక ఒత్తుడే లేటు. నీళ్లు వస్తనే ఉన్నాయి, పొలాలు పారుతనే ఉన్నాయి. ఎలక్షన్లో మేము వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారు. అలా అయితే ఎవుసం చేయలేం. నీళ్లు ఫుల్‌గా, కరెంట్ ఫుల్లుగా వస్తుంది, దీంతో రైతులం మంచిగా పంటలు పండించుకుంటున్నాం. కరెంట్ లేకపోతే బోరుమోటర్ల మీద వ్యవసం చేసుకునేటోళ్లు ఎలా చేస్తారు. కరెంటు సరిగా లేకపోతే ఎవుసం చేయడం కష్టం. బీఆర్ఎస్ సర్కారే మళ్లీ రావాలి. నేను కారు గుర్తుకే ఓటేస్తా..
– పెద్ద సత్తయ్య, రైతు, ఉప్పులింగాపూర్. వెల్దుర్తి