గీత కార్మికులను ఆదుకున్నది కేసీఆర్
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికీ నెలనెలా రూ.2016 పింఛన్ అందజేశారని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి గీత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.
- వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా కాంగ్రెస్ చర్యలు
- గీతన్నల చైతన్య యాత్రకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి సంఘీభావం
నకిరేకల్, ఆగస్టు 6: బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికీ నెలనెలా రూ.2016 పింఛన్ అందజేశారని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి గీత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి వైన్‌షాపు టెండర్లలోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ వృత్తిదారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని, గీతన్నలకు ఇచ్చిన హామీలు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అమలుచేసే వరకు గీత కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా మానుకోట నుంచి హైదరాబాద్ వరకూ చేపడుతున్న గీతన్న చైతన్యయాత్ర గురువారం నకిరేకల్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా చిరుమర్తి లింగయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉన్న నీరా కేఫ్ విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, గౌడ వృత్తిదారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు. దేశవ్యాప్తంగా గౌడన్నలకు గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో 2022లో అప్పటి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారని గుర్తు చేశారు.
గౌడ సమాజం అభివృద్ధికి బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.వెంకట్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన యాత్రలో వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సీతారాములు, వీర య్య, బుచ్చిరాములు, గోవిందు, అంజిబాబు, అంజయ్య, యల్లయ్య, వెంకటయ్య, చినవెంకులు, వెంకటయ్య, జంగయ్య, వెంకన్న, సైదు లు, సుధాకర్, రాములు, వెంకట్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

