హత్నూర, సెప్టెంబర్ 22: సమైక్యాంధ్ర పాలనలో వ్యవసాయ రంగానికి సరైన ఆదరణ లేక కుంటుబడిపోయింది. పంటలకు సాగు నీరు, సరైన విద్యుత్ సరఫరా లేక పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని బతుకు దెరువు కోసం వలస బాటపట్టాయి. సొంత గ్రామాల్లో ఉపాధి కరువై వలస వెళ్తుంటే చూసే నాయకులే తప్ప, అండగా నిలిచినన వాళ్లు కరువయ్యారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో రైతన్నలు, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. పూర్తిగా వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారు. అందులో ఒకటైన రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
తక్షణ సాయంగా రూ.5లక్షల బీమా
రైతుబీమా చేసుకున్న భూ యజమాని ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టింది. రూ.5 లక్షల ఆర్థిక సాయం తక్షణం అందేలా కృషి చేస్తున్నది. 14 ఆగస్టు 2018న ప్రవేశపెట్టి రైతుబీమా పథకం నేడు రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తూ, అండగా నిలుస్తున్నది. హత్నూర మండలంలో 2018 నుంచి 2022 వరకు 417 మంది రైతులు మృతి చెందారు. ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయంగా మొత్తం రూ.20 కోట్ల 85 లక్షలు అందజేసింది. భూ యజమాని చనిపోయిన పది రోజుల్లో నామినీ అకౌంట్లో రూ.5 లక్షలు జమ చేస్తూ, ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నది.
రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపు
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబంలోని భూ యజమాని పేరిట ఎల్ఐసీకి తెలంగాణ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. ఏదైనా కారణంతో భూ యజమాని మృతి చెందితే ఆకుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతు పేరిట గుంట భూమి ఉన్నా చాలు ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతు పేరిట ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తూ బాండ్లు అందజేస్తున్నది. రైతు పేరిట ఒకసారి రైతుబీమాకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఏటా ఎల్ఐసీకి ప్రీమియం డబ్బులు చెల్లిస్తున్నది. రైతుపేరిట భూమి ఉన్నంతకాలం ప్రీమియం చెల్లిస్తూ రెన్యువల్ చేస్తున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగి, గుం ట భూమి ఉన్నా ఈ పథకం వర్తిస్తున్నది.
ఏటా ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం డబ్బులు చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నది. 2018 లో రూ.2271, 2019లో రూ.3457, 2020లో రూ.3486, 2021లో 4110, 2022లో రూ.3829 చొప్పున ఒక్కో రైతుకు పేరిట ప్రీమియం డబ్బు చెల్లిస్తున్నది. రైతుల వద్ద నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
రైతుబీమాతో అందిన ఆర్థిక సాయం
రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం అమలుచేసిన నాటి నుంచి ఆయా కారణాలతో మృతిచెందిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అం దేలా వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. రైతు మృతి చెందిన వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇస్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, ఎల్ఐసీ ద్వారా బీమా డబ్బులు మంజూరు చేయించి కేవలం పది రోజుల్లోనే నామినీ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మండలం లో 2018 నుంచి 2022 వరకు మొత్తం 417మంది భూ యజమానులు మృతి చెందారు. వారికి రూ.20 కోట్ల 85 లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2018లో 65 మందికి రూ.3 కోట్ల 25 లక్షలు, 2019 లో 76మందికి రూ.3కోట్ల 80లక్షలు, 2020లో 119మందికి రూ.5కోట్ల 95లక్షలు, 2021లో 82మందికి రూ.4కోట్ల 10లక్షలు, 2022 లో 75 మంది రైతులకు రూ.3కోట్ల 75 లక్షలు నామినీల ఖాతాలో జమ చేశారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మాకున్న కొద్ది పాటి భూ మిని సాగు చేసుకుంటూ కూలి పనులు చేస్తూ నా భర్త, నేను కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. కొన్ని నెలలక్రితం నా భర్తకు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సంతకాలు తీసుకుని వెళ్లి పది రోజుల్లో నా బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు జమయ్యేలా కృషి చేశారు. ఆ డబ్బు తో అప్పులు కట్టిన. పేద రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. మంచి కోరే ప్రభుత్వానికి ఎల్లప్పడూ మాలాంటోళ్ల దీవెనలు ఉంటాయి.
– మంగలి అనిత, రొయ్యపల్లి, హత్నూర
పథకంపై విస్తృత ప్రచారం
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టి న రైతుబీమా పథకంపై గ్రామాల్లో విస్తృతంగా ప్ర చారం చేస్తూ, దరఖాస్తు లు స్వీకరిస్తున్నాం. ప్రభు త్వం వ్యవసాయశాఖ ద్వా రా అమలుచేస్తున్న పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రైతుల ద్వారా దరఖాస్తులు సేకరించి ధ్రువపత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. భూమి య జమాని ఏదైనా కారణంతో మరణిస్తే వెంటనే ఆ కుటుంబం వద్దకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించి, పది రోజుల్లో ఎల్ఐసీ ద్వారా డ బ్బులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటు న్నాం. దీంతో ఆ కుటుంబాలు ఉపశమనం పొం దుతున్నారు. – వరప్రతాప్, ఏఈవో, హత్నూర