నర్సాపూర్ : కరెంట్ షాక్ తో యువరైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మన్నె శ్రీధర్ (42) ఉదయం గ్రామంలోని తన వ్యవసాయ పొలంలో బోరు మోటర్ వద్ద రిపేరు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తో మృతి చెందాడు.
కుటుంబీకులు గ్రామస్తులు శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ దవాఖనకు తరలించారు. మృతునికి భార్యా ఉమలత, ఇద్దరు కుమారులు జగదీష్ (12), ఆదిత్య (7) ఉన్నారు. శ్రీధర్ మొత్తం మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.