కోహెడ, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. లింగాల రాజయ్య(57) అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్ద వరికొయ్యలను కాల్చాడు. ఈ క్రమంలో పొగలు బాగా లేచి ఊపిరాడక ఆయన చేనులోనే చనిపోయాడు.
కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్సై అభిలాష్ కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. మృతుడు లింగాల రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వానకాలం వరికోతలు పూర్తయిన తర్వాత వరికొయ్యలు కాల్చవద్దని, కాల్చిచే భూసారం దెబ్బతింటుందని, భూమిలో అలాగే దుక్కిదున్నితే భూసారం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ, రైతులు ఆ సూచనను పట్టించుకోక ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారు.