Gas Cylinder Blast | నర్సాపూర్, సెప్టెంబర్ 8 : గ్యాస్ సిలిండర్ పేలి ఇంట్లో ఉన్నవారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ తల్లి మృతి చెంది ఏడు నెలలు అవుతుంది. వారు ప్రతి నెల మాసికం జరుపుకుంటారు.
సోమవారం తల్లి నెల మాసికం సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులు 20 మంది వరకు ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అయితే ఇంట్లో గ్యాస్ లీక్ అయినట్టు గుర్తించిన శ్రీనివాస్ అందరినీ ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లాడు. అయితే ఇంటి వాకిట్లో లీక్ అవుతున్న గ్యాస్ గురించి చర్చించుకుంటున్న సమయంలోనే ఐదు నిమిషాల వ్యవధిలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది.
పేలుడు దాటికి ఇంటి స్లాబ్ గజం పైకి లేచింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ పేలుడు వీడియో..
Srinivas Goud | రైతులందరికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Kanagal : యూరియా కోసం కనగల్ రైతుల ఎదురు చూపులు