Planting | రామాయంపేట, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రామాయంపేట ఎఫ్ఆర్వో విద్యాసాగర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. మానవ సమాజంలో మొక్కలు అత్యంత కీలకమైనవని.. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్కను పెంచితే పెరిగి పెద్దవై మనకు ఆక్సిజన్ ఇస్తాయన్నారు.
అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఐదు మొక్కలు నాటే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, లక్ష్మణ్ యాదవ్, డీజీ శ్రీనివాస్ శర్మ, జయపాల్ రెడ్డి, ఫారెస్టు రేంజర్ గీత, సిబ్బంది కృష్ణ, లక్ష్మన్, రాములు, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు