గజ్వేల్/ మర్కూక్, డిసెంబర్ 5: అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్‌లు శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వాల సహకారం ఉన్నా, లేకున్నా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా గ్రామ కమిటీలను బ లోపేతం చేసుకోవాలన్నారు.
నీటి వనరులు వృథా కాకుం డా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా ఆలోచించినప్పు డు మంచి పనులు జరుగుతాయని తెలిపారు. గ్రామ కమిటీలను నిర్లక్ష్యం చేయకుండా యు వత, ప్రజలతో మమేకమై ముం దుకు నడవాలని, ప్రతి విషయాన్ని వీడీసీ కమిటీలో చర్చిం చి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామంలో జరిగేది ప్రతీది చర్చకు వచ్చినప్పు డే సమిష్టి నిర్ణయం మేరకు సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. నేటికి గ్రామాల్లో సామాజిక వివక్షత కొనసాగుతున్నదని, కుల మతాలకు అతీతంగా మెలిగేలా స్థా నిక నాయకత్వం కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్నోళ్లు లేనివారికి సహకారం అందించి, వారి బాగుకోసం కృషి చేసినప్పుడే గ్రామ అంతా బాగుపడుతుందని కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వయం సమృద్ధి సాధించి, స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్థిల్లాయని కేసీఆర్ గుర్తుచేశారు. దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు, కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సా హం, గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పల్లెప్రగతికి దోహదం చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు విధానాలు తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని, తాను దార్శనికతతో చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ అన్నారు.
మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్నిసార్లు ప్రతికూలతలు తప్పవన్నారు. వాటికి వెరవకూడదని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తదని, తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని, అప్పటి దాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దని కేసీఆర్ అన్నారు. నూతనంగా ఎన్నిక కాబోతున్న సర్పంచ్‌లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని సూచించారు. గంగదేవిపల్లె లాంటి అభివృద్ధి చేసిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని కేసీఆర్ హితవు పలికారు. జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి ఈ సందర్భంగా కేసీఆర్ గ్రామస్తులకు వివరించారు.
గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతులు, పంటల పరిస్థితి గురించి గ్రామస్తులను పేరుపేరునా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్థిల్లిన గ్రామాలు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారడం గురించి గ్రామస్తులు కేసీఆర్‌కు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విద్యుత్, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ సీఎంగా అందించిన సహకారం, పల్లె ప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధుల గుర్తించి గ్రామస్తులు కేసీఆర్‌తో గుర్తుచేశారు.
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో మీరందించిన సహకారం చాలా గొప్పదని, ఇంచు జాగను కూడా వదులుకొని నేటి రోజుల్లో సామూహికంగా నిర్మించిన ఇండ్లకు స్థలాలు ఇవ్వడంతో మీ త్యాగం చాలా గొప్పదని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గ్రామస్తులను కొనియాడారు. గ్రామాలను 90శాతం అభివృద్ధి చేసి లైన్ మీదకు తెచ్చామని, మిగిలిన 10శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసుకునేందుకు కలిసికట్టుగా కదలాలని సూచించారు. అలా చేసుకుంటే మీ గ్రామాలకే మంచి పేరొస్త్తదన్నారు. ముఖ్యంగా విద్యపై దృష్టిసారించి, విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అన్నింటినీ పొదుపుగా వాడుకొని గర్వంగా, తెలివిగా బతకాలంటే ప్రజలకు మీ సహకారం చాలా అవసరం ఉంటుందని కేసీఆర్ అన్నారు.
మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్‌లుగా నారన్నగారి కవితరామ్మోహన్రెడ్డి, గిల్క బాల్‌నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో సర్పంచ్‌లు, వార్డుల సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపి, శాలువాలు కప్పి సన్మానించి, మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ధనలక్ష్మీకృష్ణ, మాజీ సర్పంచ్‌లు భాగ్యబాల్‌రాజు, కిష్టారెడ్డి, బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా సమావేశంలో ఉన్న గ్రామస్తుడు మాట్లాడుతూ ‘సార్ తమరి హయాం మా పల్లెలకు స్వర్ణయుగం… ఇప్పుడేముంది సార్… గోస మిలిగింది, అని కులాలు అరి గోస పడుతున్నాయి. ఏదైనా…పోగొట్టుకున్నంకనే అర్థమయితది…సార్. మీరు ఉన్నప్పుడు తెలువలే మీ విలువ… ఇప్పుడు అర్థమైతంది. మళ్ల మీరొస్తే తప్పా తెలంగాణ పల్లెలకు మునపటి కళ రాదు…మల్ల మీరే రావాలే.. వస్తారు…కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇగ మాగ్గూడ రెండేళ్లకే సరిపోయింది సా ర్… అని మాట్లాడారు. కాగా, ఆయన కేసీఆర్ వద్ద వివరించినప్పుడు బాధతో పాటు నవ్వులు విరిశాయి.