Blood Donation | మెదక్ మున్సిపాలిటీ, జూలై 9 : ప్రతి ఒక్కరూ ఎదుటి వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ అన్నారు. బుధవారం డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సంస్థ, మెదక్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని హుస్సేన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యేటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని.. ప్రతి రక్తపు బొట్టు ఇతరుల ప్రాణం నిలబెట్టడానికి తోడ్పడుతుందన్నారు.
కళాశాలకు చెందిన 30 మంది ఎన్సీసీ విద్యార్థులు రక్తదానం చేసి తమ సామాజిక సేవా నిరతిని చాటుకున్నారని ఆయన కొనియాడారు. రక్తదానం చేసిన ఎన్సీసీ విద్యార్థులకు రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తిరుమల్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నాగేంద్రరావు, వేణుగోపాల్, వెంకచేశ్వర్లు, రెడ్‌క్రాస్ సంస్థ బాధ్యులు రాజశేఖర్, బోస్ తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం