Suicide | భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం.. భర్త ఆత్మహత్య
Suicide | పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్ (38) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్ (38) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
సింగరేణి సంస్థ ఆర్జీ- 3 పరిధిలోని సెంటినరిరాలనీ నర్సరీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి దేవేందర్ పేరపల్లిలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే గుండారం శివారులోని ఓ పత్తి చేసులో దేవేందర్ మృతదేహం కనిపించింది. దేవేందర్ గత 15 ఏళ్ల క్రితం పేరపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆశీష్, కుమార్తె కీర్తన ఉన్నారు. భార్య, భర్త మధ్య రెండేళ్లుగా విభేదాలు జరుగుతున్నాయి .
ఏడాదిగా ఇద్దరి పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి మల్లేశ్వరి వెళ్లిపోయింది. అప్పటి నుండి దేవేందర్ మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసై మంగళవారం ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

