Fire Accident Victim | జహీరాబాద్, మార్చి 18 : జహీరాబాద్ పట్టణంలోని రాచన్నపేట కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం కాలిపోవడంతో రోడ్డున పడ్డ బాధితుడు కార్పెంటర్ మారుతీకి పలువురు దాతలు అండగా నిలిచారు. దాతలు మారుతీకి కార్పెంటర్ సామాగ్రిని అందజేశారు.
ఆదివారం రాత్రి స్థానిక కాలనీలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో కార్పెంటర్ దుకాణం పూర్తిగా కాలిపోవడంతో నామ సుభద్రామ్మ మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్తోపాటు సరస్వతీ శిశుమందిర్ 1999 పూర్వ విద్యార్థులు అల్లాడీ వేణుగోపాల్, గొల్ల ప్రభాకర్ తదితరులు బాధితుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
అగ్ని ప్రమాదంలో యంత్రాలు, పనిముట్లు, బైక్ పూర్తిగా కాలిపోవడంతో తిరిగి కార్పెంటర్ పనులు చేసుకునేందుకు కావాల్సిన రూ.25 వేల సామాగ్రిని బాధితుడు మారుతీకి అందజేశారు. గత 15 సంవత్సరాలుగా పట్టణానికి వలస వచ్చి కార్పెంటర్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటామని దాతలు పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితుడు కార్పెంటర్ మారుతీకి దాతలు సామాగ్రిని అందజేయడం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, దాతలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్