గుమ్మడిదల,నవంబర్1: కాలుష్య కారక రసాయన పరిశ్రమలను వెంటనే మూసివే యాలని సంగారెడ్డి జిల్లా దోమడుగులో ప్రజలు పోరుబాట పట్టారు. రసాయన పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడడమే కాకుండా సాగు భూములు, పాడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిశ్రమలకు వెంటనే రాష్ట్ర పభుత్వం మూసివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ప్రజలు హైవేపై ర్యాలీ నిర్వహి ంచారు.
కాలుష్య వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మెంగని మంగయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దోమడుగు పట్టణ ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సైంటిస్ట్‌లు బాబురావు, రవికుమార్, నీలం బరి, పర్యావరణ ప్రేమికుడు అశోక్ తదితరు లు ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలసి ఫ్లకా ర్డులు పట్టుకుని దోమడుగు నుంచి బొంతపల్లి కమాన్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ బాబురావు, కేవీపీసీ కన్వీనర్ మెంగని మంగయ్య మాట్లాడుతూ.. 12 ఏండ్ల నుంచి రసాయన పరిశ్రమల నుంచి ఇక్కడి ప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలుగుతుం దన్నారు.
రసాయన పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్థజలాలతో నల్లకుంట, రాజనా ల చెరువులతో పాటు కుంటలు,వాగులు కలుషితం కావడంతో పాటు రైతులు సాగు చేసుకున్న పంట పొలాలు, పాడినే నమ్ము కుని పశుపోషణ చేస్తున్న పాడిరైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ర్యాలీలో కేవీపీసీ సభ్యులు బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి, బాలుగౌడ్, మోహన్‌రెడ్డి, రాజీరెడ్డి,రాఘవరెడ్డి, స్వప్న,జయమ్మ, లక్ష్మి, సంతోషా, మల్లేశ్వరి, అనురాధ,రైతులు, మహిళలు పాల్గొన్నారు.