సంగారెడ్డి, జూలై14: రాష్ట్రంలో చేతి, కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారని టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్ట కింది భాగంలోని మల్లన్న ఆలయ ప్రాంగణంలో ప్రకాశం జిల్లా నుంచి తెచ్చిన గొర్రెలను ఆరుగురు లబ్ధిదారులు, కోత్లాపూర్‌లో ఆరుగురికి 20 గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గొల్ల కురుమల కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకం చేపట్టిందని గుర్తుచేశారు. సదాశివపేట మండలం పెద్దాపూర్, నాగ్సాన్పల్లి గ్రామాలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వాలు కుల, చేతి వృత్తిలను పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ కుల, చేతి వృత్తులను కాపాడుకునేందుకు ప్రత్యేక పథకాలు ప్రారంభించారన్నారు.
ఈనెల 15న కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, గొర్రెల కాపరుల సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రదీప్ యాదవ్, కౌన్సిలర్లు ఉమా మహేశ్వరి, విష్ణువర్ధన్, ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు వడ్ల వరకుమార్, ఎంపీటీసీలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, నాయకులు విజయేందర్‌రెడ్డి, లాడే మల్లేశం, డాక్టరు శ్రీహరి లబ్ధిదారులు పాల్గొన్నారు.