DWO Hema Bhargavi | మెదక్ రూరల్, డిసెంబర్ 03 : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని మెదక్ మహిళా శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. డీఆర్డీ ఏపీడీ సరస్వతి, డీపీఎం వెంకటేశ్వరరావు, సీడీపీఓలతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. దివ్యాంగులు వికలాంగత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని, పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పరుగుపందెం, షాట్‌ఫుట్, జావెలింగ్ త్రో, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు.
విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు వెంకట రమణమ్మ, స్వరూప, ఐసీడీఎస్ సూపర్వైజర్, శ్రీదేవి, మాధవి , విజయలక్ష్మి, రమ,శశికళ, ఈవోలు రవీందర్, ప్రకాష్ ,భారత్, శ్యామ్, ఏపీఎం నాగరాజ్, ఐసీపీఎస్, ఎంఎస్కే, పీహెచ్ఎల్, సఖీ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా