తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పైస్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. పైరవీలు చేయాల్సి వచ్చేది. చేయి తడపనిదే పని కాకుండే. నెలల తరబడి తహసీల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. బీఆర్ఎస్ సర్కారు ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల తలరాతలు మార్చింది. భూక్రయ విక్రయాలు, మ్యుటేషన్ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ధరణిని తీసివేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. ధరణితో డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం లేదు. కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వద్దని రైతులు కరాఖండిగా తేల్చి చెబుతున్నారు.
మెదక్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పై స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సిందే. పైరవీలు చేయాల్సిందే. చేయి తడపనిదే పని కాలేని పరిస్థితి ఉండేది. నెలల తరబడి తహసీల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల తలరాతలు మార్చింది. భూ క్రయ విక్రయాలు, మ్యుటేషన్ నిమిషాల్లోనే డిజిటల్ సంతకం పూర్తవుతున్నది. ధరణిని తీసివేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. ధరణితో డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం లేదు. పాత పద్ధతిలో రెవెన్యూ వ్యవస్థ వస్తే గొడవలు, పోలీస్స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వద్దని రైతులు కరాఖండీగా తేల్చి చెబుతున్నారు.
ధరణి వచ్చినంకనే రైతుబంధు, రైతుబీమా వస్తున్నయ్. ధరణితో భూములకు రక్షణ పెరిగింది. ధరణిని రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి. పట్టాపాస్ పుస్తకాల కోసం కాళ్లరిగేలా తిరిగినా నాడు వచ్చేవి కావు. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు దయతో భూమి కొన్నా.. అమ్మినా.. వాటి వివరాలు గంటలో మాకు తెలుస్తున్నాయి. కాంగ్రెస్ రైతులను మోసం చేయాలని చూస్తున్నది. కాంగ్రెస్ నేతలు ఎవుసంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు.ప్రజలు, రైతులు తగిన గుణపాటం చెప్తాం.
గీ కాంగ్రెసోళ్ల రైతుల మీద కుట్రలు జేయాలని చేస్తే బాగనే బుద్ది చెప్తం. గప్పట్ల కరెంటు కోతలతోటి అరిగోసపడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్రపోలే. మల్ల గ కష్టాలు వద్దు బిడ్డా. మూడు గంటల కరెంటు ఇస్తే తడిచిన పొలమే మల్ల మల్ల తడుస్తది. ఇప్పుడు 24 గంటల కరెంటుతో పొలాలు మంచిగ పండుతున్నయ్. 24 గంటల కరెంటుతో ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్లి మోటర్ వేసుకుని పంటలకు తడిపెట్టుకుంటున్నాం.రైతులను సీఎం కేసీఆర్ సారు రాజును జేసిండు.
రైతుల నోట్లో మట్టి కొట్టేందుకే కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు అంటున్నరు.. ఇనొద్దుల వలే కరెంటు 24 గంటలు రావడం వల్లే పొలంలో కూరగాయల్ని పండించి మార్కెట్లో అమ్ముకుంటున్నాం. ఎవుసం ఏరందిలేకుండే.. కేసీఆర్ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తుంటే.. మూడు గంటల కరెంటుతోఎట్ల సరిపోతుంది. కరెంటు లేక పోతే కూళీ పని దొరకడం కూడా కష్టమవుతుంది. కరెంట్ ఇస్తున్నరు.. రైతు బంధు ఇస్తున్నారు.. ఏమి రందిలేకుండే, మళ్ల కేసీఆరే సారునే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ వస్తే తెలందాక గోసలు తప్పవు.
ధరణి రద్దయితే రైతులకు రైతుబంధు, రైతుబీమా ఆగిపోతయి. బతుకులు ఆగమైతయి. తెలంగాణ ప్రభత్వంలో సీఎం కేసీఆర్ భూరికార్డులు ప్రక్షాళన చేసి కొత్త పట్టాపాసుపుస్తకాలు ఇచ్చారు. ధరణిల్లో భూములన్నీ నిక్షిప్తమయ్యాయి. అప్పటి నుంచే రైతులకు రైతుబంధు, రైతు బీమా వస్తున్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తా.
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే మూరెడు పొలం కూడా పారదు. ఆ ఇచ్చే మూడు గంటలు పగలు ఇస్తాడా, రాత్రి ఇస్తాడా చెప్పలేదు. కాంగ్రెస్ పాలించిన టైంలో ఎవుసానికి నీరు పారపెట్టేందుకు వెళ్లి కరెంటు ఎప్పుడొస్తదో తెలియక పొలం వద్దే ఉండెటోళ్లం. కొన్ని సార్లు పాముకాటు, కరెంటు షాక్‌కు గురై మృతిచెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పోయి కేసీఆర్ సర్కారు రావడంతో మా రైతుల బాధలన్నీ తొలిగినయ్. 24 గంటలు విద్యుత్ వస్తుండడంతో అవసరమైనప్పుడు బోరు వేసుకుంటున్నాం. ఇన్నేండ్ల పాలనలో కెసీఆర్ తప్పా మరెవరు రైతులను పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు సరఫరా బాగుంది. గత ప్రభుత్వాల హయాంలో రాత్రి సమయాల్లో మోటర్ల దగ్గరకు వెళ్లి నానా అవస్థలు పడ్డాం. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలాని అంటున్న కాంగ్రెసోళ్ల రైతులు కోపంగా ఉన్నారు. రైతు చల్లగా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలి. కాంగ్రెస్ నాయకుల మాటలను రైతులు నమ్మరు.
కాంగ్రెస్ హయాంలో పరిపాలన రైతుల పాలిట శాపంగా ఉండేది. తెలంగాణ తీసుకొచ్చిన ధరణి పొర్టల్తో రైతులకు చాలా వరకు మేలే జరిగింది. గతంలో ఉన్న తప్పులను సరిదిద్దేందుకు రైతుల భూములకు రక్షణగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 50 ఏళ్ల నాటి పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుంది.
గీ కాంగ్రెసోళ్ల పాలనలో చీకటి రోజుల్లో బతినం. పొద్దుగల్ల, చీకట్ల ఎప్పుడు కరంటు వస్తుందో తెల్వదు. ఇగ మా తండాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండే. తెలంగాణ ఒచ్చినంకే కరెంటు మంచిగ వొస్తుంది. గిప్పుడుగిప్పుడే రైతులు జర తెల్లబడుతున్నరు. మళ్లా మమ్మల్ని ఆగంజేస్తర. గీ కాంగ్రెసోళ్ల పాలనను జనం నమ్మరు.మా బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సారే మళ్లా సీఎం గావాలే.
ఎవుసానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనడం విడ్డూరం. పొరపాటున కాంగ్రెస్‌కు గిట్ల ఓటు వేస్తిమా.. కరెంట్ కష్టాలు తప్పవు. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక పంటకు నీళ్లు అందించాలని, చీకటిలో పొలాల దగ్గర పోయి పాములు, తేళ్ల కాట్లకు బలికావడం ఖాయం. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అందుతున్నది. రంది లేకుండా ఎవుసం చేస్తున్నం. సీఎం కేసీఆర్ రైతులు బాగుండాలని సరిపడా కరెంట్ ఇవ్వడంతోనే అధిక దిగుబడులు పండుతున్నయి.
కాంగ్రెస్ నాయకులకు పొలానికి నీరు ఎలా పారపెట్టాలి అనేదానిపై అవగాహన ఉందా. ఎవుసం తెలిసినవాడు 10 హెచ్‌పీ మోటర్ పెట్టమని చెప్పడు. నాటి నుంచి కాంగ్రెస్ రైతులకు చేసిందేమీలేదు. పదేండ్ల కాలం నుంచి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండు. దీంతో పంటలు మంచిగా పండుతున్నయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామనడం రైతులను ఆగం చేయడమే. రైతులంతా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు.
కాంగ్రెస్ 3 గంటల కరెంటు ఇస్తే, ఎట్లా సరిపోతది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం నానా తిప్పలు పడ్డాం. రోడ్లేక్కి ధర్నాలు రాస్తారోకోలు చేశాం కానీ రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ తెచ్చుకున్నాక సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారు. కరెంటు తిప్పలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం. మళ్లీ తెలంగాణ పార్టీకి ఓటు వేసి కేసీఆర్‌ను గెలిపించుకుందాం.
24గంటల కరెంట్‌తో పొలం ఎండిపోతది అనే భయం లేదు. కాంగ్రెస్ గనుక 3 గంటల కరెంట్ ఇస్తే అప్పుడు నేను 10 హెచ్‌పీ మోటర్ వాడాలి. అదో దుబారా ఖర్చు. ఇంకోటి మళ్ల నేను కాంగ్రెస్ ఓటు వేసి రాత్రిళ్లు పొలాల పొంటి తిరుగుడు నాకు వద్దు. ఆ మూడు గంటల కరెంట్‌లో కూడా ఎప్పుడిస్తడో తెలియకపోతే నేను పొలం వద్దే పడిగాపులు పడాల్సివస్తాది.
ధరణితో రైతులకు శానా మేలు జరిగింది. ధరణి రద్ధు జేస్తే మళ్లా దళారుల ఒస్తరు. భూములు గోల్మాల్ జేస్తరు. పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తే ఇగ రైతులకు గోస మొదలైనట్టే. ధరణిలో ఐతే.. ఎప్పుడు అంటే గప్పుడు సూసుకోవచ్చు. గతంల భూముల యవ్వారాలు సూసుకోవాలంటే గా అధికారుల సుట్టూ తిరిగేది. గిప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఆలోచించి ఓటెయ్యాలె. కాంగ్రెస్‌కు బుద్ధి జెప్పాలె.
కాంగ్రెస్ పాలనలో సరిగ్గా కరెంటు ఉండేది కాదు. పొలాల వద్ద రైతులందరం కలిసి రాత్రి సమయంలో కరెంట్ కోసం పడిగాపులు పడేవాళ్లం. తెలంగాణ వచ్చాక 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు 3 గంటల విద్యుత్ చాలు, 10 హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పడం బాధాకరం. 10 హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేస్తే ఇచ్చిన కరెంటు సరిపోక, మోటర్లు కూడా కాలిపోతయి. అందుకే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
కాంగ్రెసోళ్లు మూడు గంటలు కరెంట్ ఇస్తామంటే రైతులు వ్యవసాయ బంద్ చేసుకోవాలి. మూడు గంటల కరెంట్‌తో పొలం తడవదు. 24 గంటల కరెంటుతోనే పంటలు పండిచుకుంటూ సంతోషంగా ఉంటున్నాం. రైతు బంధు పైసలు పడుతున్నయ్. అనుకున్న సమయానికి పంటలు చేతికి వత్తున్నయ్ప. నేను ఇప్పుడు రెండో పంటగా మళ్లీ వరి సాగు చేస్తున్నా. రైతులను ఇబ్బంది పెట్టె మాటలు మాట్లాడితే మంచిది కాదు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటుతో వ్యవసాయం చేయలేరు.
యాసంగిలో మూడు గంటల కరెంటు ఎట్లా సరిపోతుంది. ఇరువై,ముఫ్పై ఎకరాల భూస్వాములే టెన్హెచ్పీ మోటర్ల వాడడం లేదు. మములుగా చిన్న సన్నకారు రైతులకు టెహెచ్పీ,హెచ్‌పీ వరకు సరిపోతుంది. 24 గంటల కరంటు అయితేనే నడుస్తుంది. పుల్ పోసే బోర్లకు కూడా టెన్హెచ్పీ మోటర్ సరిపోతుంది. రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేకుండా నాయకులు మాట్లాడడం సరికాదు.రైతులను తప్పు తోవ పట్టే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ వచ్చాక రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 24గంటలు కరెంట్ ఇస్తుండటంతో రైతులమంతా బాధ లేకుండా బంగారు పంటలు పండించుకుటున్నాం. పంటలకు నీళ్లు పారిచేందుకు తెల్లందాంక బాయిలకాడికి, బోర్లకాడికి పోవుడు తప్పింది. కరెంట్ తిప్పలు లేకపోవడంతో రైతులమంతా ఉన్న సేద్యం చేసుకుంటూ సఖంగా ఉంటానాం. 24గంటల కరెంట్‌ను 3గంటలకు తగ్గిస్తే గొడ్డు, గోదాకు గడ్డి కూడా పెంచే పరిస్థితి ఉండదు. ఎన్నడో పోయిన కరెంట్ బాధలను మళ్లీ తీసుకొస్తామంటున్న పార్టీలను రైతులు, రైతు కూలీలు ఆధరించవు.
నా పేరు దొంతి ముత్యాలు. నాకు తూప్రాన్ చెరు ఎనక 3 ఎకరాల పొలం ఉన్నది. కేసీఆరు సారు పొద్దు మాపు ఇతుమారం లేకుండా 24 గంటలు కరెంటు ఇయ్యబట్టే. వానకాలం, యాసంగికి ఢోకా లేకుంట రెండు తాపలు పంటలు పండుతున్నయి. కాంగ్రెసోళ్లప్పుడు కరెంటు ఎప్పుడొస్తదో, రాదో తెలువక ఎండకు ఎండి, సలికి ఒనుకుకుంట రాత్రుల పూట పొలాల దగ్గర కావాలి గాస్తుంటిమి. గిప్పుడు మూడు గంటల కరెంటు ఇస్తమంటే ఓటెస్తమా? సస్తే కూడా ఓటెయ్యం. మళ్ళ కేసీఆర్ సారే రావాలె, 24 గంటల కరెంటు కావాలె. కారు గుర్తుకే ఓటేస్తం. రైతు బంధు, పింఛను కూడా రావట్టె. ఇంకేం కావలనయ్య.. గప్పుడు కాంగ్రెసోళ్లుండంగ రెండు వందల రూపాల పింఛన్గూడా సక్కగ రాలే.