Edupayala Temple | పాపన్నపేట, జూన్ 1 : భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారు తల్లిగా విరాజిల్లుతున్న వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యాం, బ్రహ్మచారి, బత్తినిరాజు, నర్సింలు, మహేష్, వరుణాచారి, యాదగిరి నరేష్, దీపక్, తదితరులు ఏర్పాటు చేయగా వేదపండితులు శంకర శర్మ, పార్థివ శర్మ ,రాము , శేఖర్ నాగరాజు తదితరులు పూజలు నిర్వహించారు.
ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ చర్యలు చేపట్టారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!