శమ్నాపూర్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తా
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు నిర్మాణం చేపట్టడం ద్వారా రవాణా సదుపాయం మెరుగుపడుతుందన్నారు.
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
- రోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగు
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
హవేళీఘనపూర్, ఫిబ్రవరి 20: గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు నిర్మాణం చేపట్టడం ద్వారా రవాణా సదుపాయం మెరుగుపడుతుందన్నారు. సోమవారం మండలంలోని శమ్నాపూర్ గ్రామంలో రూ. 10లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవాలయం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మండలంలో గతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హవేళీఘనపూర్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్ల కు నిధులు మంజూరు చేయించి రవాణా సదుపాయం మెరుగుపర్చమని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించుకున్నామన్నారు. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి వచ్చి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కూతవేటు దూరంలో ఉన్న మెదక్‌కు వెళితే పనులు చేసుకోవచ్చన్నారు. గ్రామ సర్పంచ్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజరాజేశ్వరి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకరిస్తానన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ. 2 లక్షల వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, గ్రామ సర్పంచ్ లింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ పీఎసీఎస్ డైరెక్టర్ సాప సాయిలు, గ్రామ సర్పంచులు యామిరెడ్డి, మంద శ్రీహరి, ఎంపీటీసీ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు సతీశ్‌రావు, రమేశ్, వెంకట్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

