గజ్వేల్, అక్టోబర్ 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని, కానీ రేవంత్‌రెడ్డి 22 నెలల కాలంలోనే 22 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు వచ్చాయన్నారు.
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయకుండా నిర్వహించాలని, ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము బీఆర్ఎస్కు ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, ఎప్పుడు సీఎం అవుతారా అని ఎదురుచూస్తున్నారన్నారు. 42శా తం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు అత్తెల్లి శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, నాయకులు నర్సింగరావు, రవీందర్, కనకయ్య పాల్గొన్నారు.
తూప్రాన్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ కుమ్మరి రఘుపతి, కుమ్మరి రమేశ్, పడాలపల్లి బలరాంరెడ్డి తదితరులకు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి గులాబీ జెండా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కొండపాకకు చెందిన నాగరాజు, దుద్దెడ గ్రామానికి చెం దిన స్వామిలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ నిబద్ధతతో కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పనిచేయాలన్నారు.తూప్రాన్ మాజీ జడ్పీటీసీ రాణీసత్యనారాయణగౌడ్, నాయకులు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, ప్రభాకర్‌రెడ్డి,మాజీ ఎంపీటీసీలు వెంకటేశ్‌యాదవ్, నారాయణ, ముజీ బ్, జయరాములు పాల్గొన్నారు.