మనోహరాబాద్/ నిజాంపేట/ చేగుంట, మార్చి 29 : సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లెలకు పంచాయతీ హోదా కల్పించడమే కాకుండా వాటి అభివృద్ధి కోసం కోట్లాది నిధులను మంజూరు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కలిసికట్టుగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీదిరవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ నర్సయ్య పాల్గొన్నారు.
నిజాంపేట మండలపరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను సర్పంచ్ కవితతో ఎంపీపీ సిద్ధిరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం పీపీ మాట్లాడుతూ.. అంతర్గత సీసీరోడ్లు నిర్మాణాలతో గ్రామా ల రూపురేఖలు మారుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్యోతి, నాయకులు రాజు, ఎల్లం, శ్రీనివాస్‌గౌడ్, మురళి ఉన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్ఎస్ నార్సింగి మండలాధ్యక్షుడు మైలారం బాబు అన్నారు. నార్సింగి మండలకేంద్రంలోని చేపట్టిన సీసీరోడ్ల ప నులకు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, మురు గునీటి కాలువల నిర్మాణాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, నాయకుడు నవీన్ ఉన్నారు.
రామాయంపేట, మార్చి 29 : పరిసరాలు పరిశుభ్రంగా ఉం టేనే ఆరోగ్యాలు బాగుంటాయని ఎంపీపీ నార్సింపేట భిక్షపతి అన్నారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో పరిసరాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. చెత్తాచెదారంతోనే వ్యాధులు వస్తాయని, దోమలు రాకుండా ఉండాలంటే మురికికాల్వలు శుభ్రంగా ఉం డాలని, ఇండ్ల ముందర నీరు నిల్వ చేరకుండా చూడాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ దోమ చంద్రకళ, ఉప సర్పంచ్ దీపక్‌రెడ్డి, కార్యదర్శి చంద్రహాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.