చేరికల జోష్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
- అభివృద్ధి చూసే బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
- బీఆర్ఎస్లో చేరిన 50 మంది సస్కల్ కాంగ్రెస్ నాయకులు
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
నిజాంపేట,సెప్టెంబర్15: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన 50మంది మైనార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. అనంతరం నస్కల్లో ముస్లింల శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దిరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు మా వురం రాజు, మండల కోఆప్షన్ సభ్యుడు గౌస్, చల్మెడ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లం, మహేశ్, అబ్దుల్, హబీబ్, అక్బర్, అలీబాయ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

