DBF National secretary | నిజాంపేట, జూన్ 17 : బచ్చురాజ్పల్లికి చెందిన గాజులపల్లి స్వామిని తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో దున్నతుండగా దాడి చేసిన తిప్పలగుల్లకు చెందిన నిందితుడు సహదేవ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శంకర్ మంగళవారం బచ్చురాజ్పల్లికి వెళ్లి బాధితుడు స్వామిని పరామర్శించి విలేకరులతో మాట్లాడారు.
గ్రామంలో సర్వే నంబర్ 163,164లలో 3.30 ఎకరాల భూమిని 40 ఏండ్ల కింద గౌరి బుచ్చమ్మ, గౌరి రాజయ్య నుంచి దళితులు కొనుగోలు చేయగా ప్రభుత్వం వారి పేరిట భూపట్టా పాస్ బుక్‌లను ఇచ్చిందన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నుంచి భూ విషయంలో సహదేవ్ దళితులను బెదిరింపులకు గురి చేస్తూ.. దాడి చేయగా బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడన్నారు.
తూప్రాన్ డీఎస్పీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుపై సోమవారం విచారణ చేశారన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడు సహదేవ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని.. అతన్ని వెంటనే అరెస్ట్ చేస్తూ దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్,గ్రామస్తులు వినోద్‌నాయక్,బాబు,శ్రీను తదితరులు ఉన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా