Missing | నర్సాపూర్, సెప్టెంబర్ 20 : ఇంట్లో నుండి యువతి అదృశ్యమైన సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన లున్సావత్ కవిత (21) ఇంటర్మీడియట్ వరకు చదివి, చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నది.
అయితే ఈ నెల 18వ తేదీన రాత్రి కుటుంబ సభ్యులు భోజనం చేసి అందరూ పడుకున్నారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో కవిత తండ్రి బిక్య బాత్రూం కోసమని లేచి చూడగా తన కూతురు ఇంట్లో కనిపించలేదు. దీంతో తన కూతురు కోసం బిక్య కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇండ్ల వద్ద వెతికినా ఆచూకి లభించలేదు.ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.
Katamaya Kits | గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలి
Kothagudem Urban : ‘దసరా పండుగకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు.. 50 శాతం అదనపు చార్జీలు’
Kothagudem Urban : పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలి : దాసరి సారధి