సిద్దిపేట, అక్టోబర్ 3 : దసరా అంటేనే సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక అని, నేటి పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయం వద్ద కాశీగంగాహారతి, రంగధాంపల్లి, రూరల్ పీఎస్ హనుమాన్ దేవాలయం వద్ద రావణ దహనాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భావితరాలకు మనం ఇచ్చే సంపద మన సంస్కృతీ సంప్రదాయాలన్నారు. దేశ విదేశాల్లో మన పండుగలను గొప్పగా జరుపుకొంటారన్నారు.
దసరా పండుగ మనకు పెద్దలపై గౌరవాన్ని గుర్తు చేస్తున్నదని, మనలో చెడును తొలిగించి మంచిని నేర్పుతుందన్నారు. నర్సాపూర్‌లోని దేవాలయం వద్ద గంగాహారతి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కాశీలో గంగానది తీరాన జరిగే ఈహారతి సిద్దిపేటలో జరగడం చాలా సంతోషమన్నారు. కాశీ నుంచి పురోహితులు సిద్దిపేటకు వచ్చి హారతి ఇచ్చి కాశీని తలపింపజేశారన్నారు. దసరా అంటేనే చెడుపై మంచి విజయమని, ధర్మం మీద న్యాయం గెలుస్తుంది అని అర్థమన్నారు. సిద్దిపేటకు రైలు కల, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామన్నారు.
నిత్యం నిండుకుండలా జలకళతో ఉండే కాళేశ్వరం రంగనాయకసాగర్ని నిర్మించుకున్నామన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. నాడు తెలంగాణ వస్తదా అన్నారని.. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. దేశానికి, మంచి నీళ్ల పథకానికి తెలంగాణ దిక్సూచిగా గుర్తింపువచ్చిందన్నారు. తెలంగాణకు సిద్దిపేట దిక్సూచి అయ్యిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అయోమయంలో ఉన్నాయన్నారు. వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు.
దేవుడిని ప్రార్థిస్తున్నా అంతా మంచి జరగాలని, మళ్లీ మంచి రోజులు రావాలన్నారు. జమ్మి పెట్టి తల్లిదండ్రుల వద్ద ఆశీస్సులు తీసుకోవాలన్నారు. పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి అన్నారు. కులమతాలకతీతంగా మనం పండుగలు జరుపుకుంటున్నామన్నారు. పిల్లలకు చదువుతో పాటు సంప్రదాయం నేర్పించాలన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆదేవుడిని కోరుకుంటున్నటు ్లఆయన తెలిపారు.