Medak Church | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 9 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంత కిటకిటలాడింది. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్లు జైపాల్, డేవిడ్, శ్రీనివాస్‌లు భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు. ప్రభువైన ఏసు అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ లోక రక్షకుడిగా ఉండి పరలోకం నుంచే తన దీవెనలను అందిస్తాడన్నారు. నమ్ముకున్న వారి గుండెల్లో దైవ సహాయకుడిగా ఉంటారన్నారు. ఈ సందర్బంగా ఆలపించిన యేసయ్య భక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, జయరాజ్, సంశాన్ సందీప్, సువణ్ డగ్లస్, ప్రాంక్ జాన్సన్, ప్రభుదాస్, దేవరాజ్, నోబుల్సన్తో పాటు భక్తులు పాల్గోన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణంతో పాటు చర్చి పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భక్తులు చర్చిలోని వసతి గృహాల వద్ద, చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్